Moon | చంద్రుడిపై మట్టితో మంచినీరు.. చైనా శాస్త్రవేత్తల సరికొత్త ప్రయోగం
చంద్రుడిని మానవులకు నివాసయోగ్యంగా మార్చే దిశగా చైనాకు చెందిన శాస్త్రవేత్తలు సరికొత్త ప్రయోగం చేపట్టారు. మానవ మనుగడకు కీలకమైన నీటి వనరులను సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
Moon | బీజింగ్, ఆగస్టు 26: చంద్రుడిని మానవులకు నివాసయోగ్యంగా మార్చే దిశగా చైనాకు చెందిన శాస్త్రవేత్తలు సరికొత్త ప్రయోగం చేపట్టారు. మానవ మనుగడకు కీలకమైన నీటి వనరులను సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్(సీఏఎస్)లోని నింగ్బో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటీరియల్స్ టెక్నాలజీ అండ్ ఇంజినీరింగ్‌కు చెందిన శాస్త్రవేత్తలు చంద్రుడి ఉపరితలం నుంచి సేకరించిన మట్టి నుంచి నీటిని వెలికితీశారు.
చాంగ్ ఈ-5 మిషన్‌లో భాగంగా చంద్రుడి ఉపరితలం నుంచి తెచ్చిన మట్టిని 1,200 కెల్విన్‌కు పైగా వేడి చేసి, ప్రత్యేకమైన ప్రక్రియ ద్వారా నీటిని తీసినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఒక టన్ను మట్టితో దాదాపు 500 లీటర్ల తాగు నీటిని తయారుచేయవచ్చని వీరు పేర్కొన్నారు. చంద్రుడిపై మట్టి నుంచి తయారుచేసిన నీటిని హైడ్రోజెన్, ఆక్సిజన్‌గా కూడా వేరు చేయవచ్చని శాస్త్రవేత్తలు చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo | సౌదీపై హౌతీ దాడుల ఎఫెక్ట్.. రియాద్, జెద్దా నుంచి విమానాలు రద్దు చేసిన ఇండిగో
Train | డిసెంబర్ 4న విజయ్ సేతుపతి ‘ట్రైన్’.. నితిన్, నాగచైతన్య సినిమాలకు గట్టి పోటీ!
Bathukamma Celebrations | దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.. ఫొటోలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

