Saudi Arabia | సౌదీ అరేబియాలో తొలిసారిగా మద్యం దుకాణం..! ఎవరి కోసమంటే..?
Saudi Arabia | సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో తొలిసారిగా మద్యం దుకాణం ప్రారంభించనున్నారు. ఇందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మద్యం దుకాణంలో కేవలం ముస్లిమేతర దౌత్యవేత్తలకు మాత్రమే ఆల్కహాల్‌ను విక్రయించనున్నారు.
Saudi Arabia | రియాద్ : సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో తొలిసారిగా మద్యం దుకాణం ప్రారంభించనున్నారు. ఇందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మద్యం దుకాణంలో కేవలం ముస్లిమేతర దౌత్యవేత్తలకు మాత్రమే ఆల్కహాల్‌ను విక్రయించనున్నారు.
మద్యం కావాలనుకునే వారు మొబైల్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, అంతేకాకుండా విదేశాంగ మంత్రి నుంచి క్లియరెన్స్ కోడ్ పొందాలని సౌదీ అరేబియా తెలిపింది. ప్రతి నెల కోటాకు మంచి మద్యం విక్రయాలు జరపబడవు అని స్పష్టం చేసింది. దౌత్యవేత్తలకు పరిమితంగానే మద్యం విక్రయాలు ఉంటాయని తెలిపింది.
ఇస్లాంలో మద్యం సేవించడం నిషేధం. కానీ పర్యాటకం, వ్యాపారాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ నేతృత్వంలో ఈ నిర్ణయం తీసుకోవడం ఒక మైలు రాయి అని సౌదీ అరేబియా తెలిపింది. ఆల్కహాల్ స్టోర్ తెరవడం విజన్ 2030లో కూడా భాగమని, ఎందుకంటే.. చమురు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఉపయోగపడుతుందన్నారు.
కొత్త ఆల్కహాల్ స్టోర్ రియాద్‌లోని డిప్లొమాటిక్ క్వార్టర్లో ఏర్పాటు చేశారు. ఇక్కడే రాయబార కార్యాలయాలు ఉన్నాయి. దౌత్యవేత్తల నివాసాలు కూడా ఉన్నాయి. ఇక ఆల్కహాల్ స్టోర్‌ను రాబోయే రోజుల్లో తెరవనున్నారు. సౌదీ అరేబియాలో మద్యం సేవించడం పట్ల కఠినమైన చట్టాలు ఉన్నాయి. మద్యం సేవిస్తే వందలాది కొరడా దెబ్బలు, బహిష్కరణ, జరిమానాలు లేదా జైలు శిక్ష విధించబడుతుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

