Saudi Arabia | మరో భారీ ప్రాజెక్ట్‌కు రెడీ అయిన సౌదీ.. బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ‘ది ముకాబ్’..!
Saudi Arabia | మరో అబ్బురపరిచే నిర్మాణానికి అరబ్ కంట్రీ సౌదీ అరేబియా (Saudi Arabia) రెడీ అవుతోంది. రాజధాని నగరం రియాద్ (Riyadh)లో ‘ది ముకాబ్’ (The Mukaab) పేరుతో అతి భారీ నిర్మాణాన్ని చేపట్టేందుకు సిద్ధమైంది. తర్వలో నిర్మాణం కానున్న ఈ అత్యద్భుత కట్టడానికి సంబంధించిన ప్రచార వీడియోను(promotional video) సౌదీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది.
Saudi Arabia | ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా పేరు తెచ్చుకుంది అరబ్ కంట్రీ సౌదీ అరేబియా (Saudi Arabia). ఎటుచూసినా ఆకాశహర్మ్యాలు, భారీ నిర్మాణాలు, వెరైటీ ప్రాజెక్టులతో ఆశ్చర్యపరిచే ఆ దేశం.. మరోసారి ప్రపంచ దేశాల దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. సౌదీ ఇటీవలే తాబేలు ఆకారంలో భారీ ఓడను నిర్మించేందుకు రెడీ అయిన విషయం తెలిసిందే. దాన్ని తేలియాడే నగరంగా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. దానికి ‘పాంజియోస్’ అని నామకరణం కూడా చేసింది. తాజాగా మరో అబ్బురపరిచే నిర్మాణానికి ఈ అరబ్ కంట్రీ రెడీ అవుతోంది.
రాజధాని నగరం రియాద్ (Riyadh)లో ‘ది ముకాబ్’ (The Mukaab) పేరుతో అతి భారీ నిర్మాణాన్ని చేపట్టేందుకు సిద్ధమైంది. తర్వలో నిర్మాణం కానున్న ఈ అత్యద్భుత కట్టడానికి సంబంధించిన ప్రచార వీడియోను(promotional video) సౌదీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. బంగారు వర్ణంలో మెరిసిపోతున్న భారీ భవంతిని వీడియో ద్వారా ప్రపంచానికి పరిచయం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.
అరబ్ న్యూస్ (Arab News) ప్రకారం.. క్యూబ్ ఆకారంలో ఉన్న ఈ భారీ బిల్డింగ్ దాదాపు 400 మీటర్లు ఎత్తు ఉండనుంది. ఇది న్యూయార్క్ (New York)లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ (Empire State Building) కంటే 20 రెట్లు పెద్దది. ఇందులో మ్యూజియం, టెక్నాలజీ అండ్ డిజైన్ యూనివర్సిటీ, మల్టీ పర్పస్ థియేటర్, మరో 80కిపైగా కల్చరల్, ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు కూడా ఏర్పాటు కానుండడం విశేషం. ఈ భారీ నిర్మాణాన్ని 2030 నాటికల్లా పూర్తి చేయాలని అధికారులు టార్గెట్‌గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బిల్డింగ్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు అరబ్ న్యూస్ తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

