కీవ్: ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్ పవర్ ప్లాంట్‌కు సమీపంలోని అణు ఇంధ న నిల్వ కేంద్రంపై రష్యా దాడి చేసిందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ తెలిపారు. ఇది అత్యంత నీచమైన చర్య అని విమర్శించారు. భారీ స్థాయిలో అణు పదార్థాలు నిల్వ ఉన్న ప్రాంతానికి సమీపంలోని ఫ్యూయల్ నిల్వ ఉంచే బిల్డింగ్ భారీగా దెబ్బతిన్నదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తెలిపింది.
ప్రస్తుతానికి ఎలాంటి రేడియేషన్ భారీ స్థాయిలో రావట్లేదని.. సాధారణ స్థాయిలోనే రేడియేషన్ ఉన్నట్టు ఐఏఈఏ స్పష్టం చేసింది. ఇక అణుకేంద్ర బిల్డింగ్‌పై దాడి జరిగిన వెంటనే ఉక్రెయిన్ సాయుధ దళాలు మంటలను ఆర్పేశాయని జెలెన్ స్కీ వెల్లడించారు.