మాస్కో: రష్యా సైన్యం మళ్లీ సైనిక శిక్షణలో పాల్గొనున్నది. తాజాగా బెలారస్లో సైనిక శిక్షణ పూర్తి చేసుకున్న రష్యా సైన్యం.. రేపు మరోసారి ఆ శిక్షణ నిర్వహించనున్నది. వ్యూహాత్మక డ్రిల్స్‌లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఆ దేశ సైన్యం చేపట్టనున్నది. ఈ శిక్షణా కార్యక్రమాన్ని అధ్యక్షుడు పుతిన్ ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. అయితే సైనిక శిక్షణలో భాగంగా.. రష్యా సైన్యం బాలిస్టిక్ తో పాటు క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించనున్నది. ఫిబ్రవరి 19వ తేదీన ఈ పరీక్షలు ఉంటాయని రష్యా అధికారికంగా పేర్కొన్నది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత ఉన్న నేపథ్యంలో.. రష్యా సైనిక శిక్షణ మరింత ఉత్కంఠ రేపుతోంది.