కీవ్‌లోకి రష్యా బలగాలు.. యుద్ధ ట్యాంక్‌లతో పహారా
కీవ్ : రష్యా బలగాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోకి ఎంటర్ అయ్యాయి. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధికారులు ఓ ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఒబలన్ జిల్లాలో ఉన్న పార్లమెంట్‌కు 9 కిలోమీటర్ల దూరంలో శత్రువులు మోహరించి ఉన్నట్లు ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. అయితే మోలటోవ్ కాక్టెయిల్స్(పెట్రోల్ బాంబులు)తో రష్యా బలగాలపై ప్రతిదాడికి దిగాలని స్థానికులకు ఉక్రెయిన్ ప్రభుత్వం ఆదేశించింది. ఇండ్లను వదిలి ఎవరూ బయటకు రావొద్దు అని అధికారులు తెలిపారు. కీవ్‌లో ఇప్పటికీ భారీ శబ్ధాలు వినిపిస్తున్నట్లు కొందరంటున్నారు. ఒబలన్ జిల్లాలో రష్యా ట్యాంకులు పహారా కాస్తున్న దృశ్యాలను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. నివాసాలు ఎక్కువగా ఉండే ఒబలన్ ప్రాంతాన్ని రష్యా బలగాలు చేజిక్కించుకున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్‌లో ఉన్న నగరాలపై రష్యా దాడులు కొనసాగిస్తూనే ఉన్నది. గడిచిన 24 గంటల్లో 33 నివాస ప్రాంతాలను రష్యా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.
WATCH: Russian military vehicles driving in northern Kyiv pic.twitter.com/TupEK3Zsjy
— BNO News (@BNONews) February 25, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Kyiv
- military vehicles
- Russia
- tanks
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

