కూలిన రష్యా సైనిక విమానం
ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలను తరలిస్తున్న రష్యా సైనిక విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు సహా, ఆరుగురు సిబ్బంది, మరో ముగ్గురు వ్యక్తులు మరణించారని రష్యా రక్షణశాఖ బుధవారం ప్రకటించింది.
- ఉక్రెయిన్ ఖైదీలు సహా 74 మంది దుర్మరణం
- ఉక్రెయిన్ సైన్యమే కూల్చేసిందన్న రష్యా
మాస్కో, జనవరి 24: ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలను తరలిస్తున్న రష్యా సైనిక విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు సహా, ఆరుగురు సిబ్బంది, మరో ముగ్గురు వ్యక్తులు మరణించారని రష్యా రక్షణశాఖ బుధవారం ప్రకటించింది. ప్రమాద ఘటన ఉక్రెయిన్ సరిహద్దు బెల్గోరాడ్లోని కోరోఛాన్సీ జిల్లాలో చోటుచేసుకుందని ఆ రాష్ట్ర గవర్నర్ వ్యాచిస్లేవ్ గ్లాడ్కోవ్ మీడియాకు తెలిపారు.
ప్రమాదానికి దారి తీసిన కారణాలు ఆయన వెల్లడించలేదు. ఖైదీల మార్పిడిలో భాగంగా ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలను బెల్గోరాడ్కు తరలిస్తుండగా విమానం ప్రమాదానికి గురైందని రష్యా అధికారులు చెబుతున్నారు. ఉక్రెయిన్ సైనిక బలగాలే తమ విమానాన్ని కూల్చేశాయని రష్యా రక్షణశాఖ ఆరోపించింది. ఉక్రెయిన్ ఆధీనంలోని ఖార్కీవ్ నుంచి బెల్గోరాడ్ ప్రాంతంపైకి రెండు క్షిపణుల్ని ఉక్రెయిన్ బలగాలు ప్రయోగించాయని, దాడులు జరిగినట్టు తమ రాడార్లు గుర్తించాయని రష్యా తెలిపింది. క్షిపణి దాడులను తీవ్రవాద చర్యగా పేర్కొన్నది.
ఖైదీల తరలింపు నిజమేనా!
కుప్పకూలిన విమానంలో యుద్ధ ఖైదీలున్నారన్న విషయాన్ని అంతర్జాతీయ మీడియా ఖరారు చేయలేదు. ఇరు దేశాల మధ్య యుద్ధ ఖైదీల మార్పిడి వంటిదేదీ లేదని ఉక్రెయిన్ అధికారిక వర్గాలు చెప్పటంతో, దుర్ఘటనపై రష్యా చేసిన ప్రకటన పలు అనుమానాలకు తావిచ్చింది. విమానం కూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రమాదానికి ముందు విమానం అదుపు తప్పి కిందకు పడిపోయినట్టు కనిపించింది.
నేలను తాకే ముందు విమానం పెద్ద ఎత్తున మంటల్లో చిక్కుకుపోయింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ‘ఈ ప్రాంతంలో ఉక్రెయిన్ క్షిపణి దాడులు జరపవచ్చు. పౌరులెవ్వరూ ఇండ్లల్లో నుంచి బయటకు రావొద్దు’ అని బెల్గోరాడ్ గవర్నర్ వ్యాచిస్లేవ్ గ్లాడ్కోవ్ ప్రకటించిన కొద్ది గంటల్లో సైనిక విమానం కుప్పకూలటం సంచలనంగా మారింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | రాహుల్ గాంధీ అమెరికన్ ఎత్తుగడలు.. సీజేపీపై ఆయన వ్యూహం ఎందుకు ఫలించడం లేదు!
Vegetable Nutrition | కూరగాయలు తింటున్నా పోషకాలు అందడం లేదా? ఈ వంటింటి చిట్కాలు తెలుసుకోండి!
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

