కీవ్: సుమారు 40 మైళ్ల పొడువైన రష్యా సైనిక కాన్వాయ్ కీవ్ దిశగా వెళ్తోంది. దీనికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలను రిలీజ్ చేశారు. మాక్సర్ టెక్నాలజీ ఈ ఇమేజ్‌లను రిలీజ్ చేసింది. ఉక్రెయిన్‌పై దండయాత్ర చేపట్టిన రష్యా తన సైనిక సత్తాను ప్రదర్శిస్తోంది. రాజధాని కీవ్ నగరాన్ని చేజిక్కించుకోవాలన్న ఉద్దేశంతో రష్యాకు చెందిన భారీ కాన్వాయ్ ఆ దిశగా ముందుకు వెళ్తోంది. ఇవాన్కీవ్ సమీపంలో తీసిన ఫోటోలను మాక్సర్ విడుదల చేసింది. తొలుత 27 కిలోమీటర్ల పొడువు ఉన్నట్లు చెప్పిన మాక్సర్ టెక్నాలజీ ఆ తర్వాత తన రిపోర్ట్‌ను సరి చేసుకున్నది. రష్యా సైనిక కాన్వాయ్ దాదాపు 40 మైళ్ల పొడువు ఉన్నట్లు మాక్సర్ తాజాగా చెప్పింది. ఉక్రెయిన్ బోర్డర్ సమీపంలోని దక్షిణ బెలారస్లో ఉన్న రష్యా బలగాలు, హెలికాప్టర్ల చిత్రాలను కూడా మాక్సర్ రిలీజ్ చేసింది.