Wagner group | త్వరలో రష్యాకు నూతన అధ్యక్షుడిని ఎన్నుకోబోతున్నాం: వాగ్నర్ గ్రూప్
Wagner group | రష్యాకు త్వరలో కొత్త అధ్యక్షుడు ఎన్నిక కాబోతున్నాడని యెవ్జనీ ప్రిగోజిన్ నేతృత్వంలోని వాగ్నర్ గ్రూప్ వ్యాఖ్యానించింది. ఈ మేరకు దేశ ప్రజలను ఉద్దేశించి ఒక ప్రకటన చేసింది.
మాస్కో: రష్యాకు త్వరలో కొత్త అధ్యక్షుడు ఎన్నిక కాబోతున్నాడని యెవ్జనీ ప్రిగోజిన్ నేతృత్వంలోని వాగ్నర్ గ్రూప్ వ్యాఖ్యానించింది. ఈ మేరకు దేశ ప్రజలను ఉద్దేశించి ఒక ప్రకటన చేసింది. ఇవాళ ఉదయం జాతిని ఉద్దేశించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రసంగించిన కాసేపటికే.. వాగ్నర్ గ్రూప్ తన ప్రకటనను వెలువరించింది. ‘అతి త్వరలో మనం దేశానికి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోబోతున్నాం’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నది.
యెవ్జనీ ప్రిగోజిన్ నేతృత్వంలోని కిరాయి సైన్యం.. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రకటించినప్పటి నుంచి రష్యా సైన్యానికి మద్దతుగా యుద్ధంలో పాల్గొంటున్నది. అయితే, ఇప్పుడు ఊహించని విధంగా రష్యా సైనిక నాయకత్వంపై తిరుగుబాటు చేసింది. రొస్తోవ్లోని సైనిక స్థావరాన్ని ఆధీనంలోకి తీసుకుని రష్యాకు సైనిక నాయకత్వానికి గట్టి హెచ్చరికలు చేసింది.
రష్యా సైన్యం తన బలగాలపై దాడులకు పాల్పడిందంటూ యెవజనీ ప్రిగోజిన్ తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. అనంతరం ప్రిగోజిన్ పేరునుగానీ, వాగ్నర్ గ్రూప్ పేరునుగానీ ప్రస్తావించకుండానే రష్యా అధ్యక్షుడు పుతిన్ వారికి ఘాటు హెచ్చరికలు చేశారు. దేశంలో సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసేవాళ్లను, తిరుగుబాటు చేసేవాళ్లను దేశద్రోహులుగా పరిగణిస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే దేశానికి త్వరలో కొత్త అధ్యక్షుడంటూ వాగ్నర్ గ్రూప్ ప్రకటన చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

