మాస్కో: ఉక్రెయిన్ను నాటోలో చేర్చుకుంటే మూడో ప్రపంచ యుద్ధం తప్పదని రష్యా హెచ్చరించింది. రష్యా సమాఖ్య భద్రతా మండలి డిప్యూటీ సెక్రెటరీ అలెగ్జాండర్ వెనెడిక్టోవ్ గురువారం స్థానిక మీడియాతో చేసిన వ్యాఖ్యలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి.
నాటోలో ఉక్రెయిన్ చేర్చుకుంటే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందనే విషయం కీవ్‌కు కూడా తెలుసునన్నారు. తమకు నాటో కూటమిలో ఫాస్ట్‌ట్రాక్ సభ్యత్వం కల్పించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కోరిన కొద్దిరోజులకే రష్యా నుంచి మూడో ప్రపంచ యుద్ధం హెచ్చరిక వెలువడింది.