Russia-Ukraine War | ఉక్రెయిన్‌కు రూ.76కోట్ల సాయం అందించిన హాలీవుడ్ స్టార్ లియోనార్డో
Leonardo DiCaprio | రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్నది. గత 13 రోజులుగా రష్యా సైన్యం ఉక్రెయిన్‌లోని వివిధ నగరాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగుతున్నది. కాల్పుల విరమణకు సంబంధించి ఇరుదేశాల మధ్య జరిగిన చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌కు ఆస్కార్ విజేత, హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో ఆర్థికంగా సాయం అందించేందుకు ముందుకు వచ్చారు.
ఉక్రెయిన్‌కు 10 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.76కోట్లు) విరాళంగా అందజేశారు. ఆయన సహాయం అందించడం వెనుక పెద్ద కారణమే ఉంది. లియోనార్డో అమ్మమ్మ ఉక్రెయిన్‌లోని ఒడెస్సాకు చెందిన వారు. ఆమె అంటే హాలీవుడ్ స్టార్‌కు ఎంతో ఇష్టం. ఆమె 2008లో మరణించారు. ఆమె స్వస్థలమైన ఒడెస్సా నగరంపై ప్రస్తుతం రష్యన్ సైన్యం బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతున్నది.
ఈ సందర్భంగా డికాప్రియో ఒడెస్సాలో తన అమ్మమ్మతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నాడు. టాటైనిక్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా లియోనార్డో డికాప్రియో గుర్తింపును తెచ్చుకున్నాడు. ఈ చిత్రంలో కేట్ విన్సెస్లెట్ హీరోయిన్గా నటించింది. టైటానిక్‌తో పాటు డికాప్రియో బ్లడ్ డైమండ్, ది ఏవియేటర్, ది వోల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్, ది రెవెనెంట్, ఇన్సెప్షన్ వంటి అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించాడు.
ఇదిలా ఉండగా.. లియోనార్డో తాతలు రష్యా, జర్మనీకి చెందిన వారు. లియోనార్డో ఆయన తల్లిదండ్రులకు ఏకైక సంతానం. ఆయన లీగల్ సెక్రెటరీ కాగా.. తండ్రి కామిక్ ఆర్టిస్ట్‌గా పని చేయడంతో పాటు డిస్ట్రిబ్యూటర్, లియోనార్డోకు ఏడాది వయసు ఉన్న సమయంలో తల్లిదండ్రులిద్దరు విడాకులు తీసుకున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

