మాస్కో: అంతరిక్షంలో తొలిసారి నటులతో సినిమాను షూట్ చేయనున్నారు. అంతరిక్ష కేంద్రం (ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్)లో ఈ సినిమా షూటింగ్ జరగనున్నది. దీని కోసం రష్యాకు చెందిన రాస్‌కాస్మోస్ అంతరిక్ష ఏజెన్సీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. నలుగురు నాన్ ప్రొఫెషనల్ నటుల్ని.. అంతరిక్ష సిబ్బందిగా స్పేస్ స్టేషన్‌కు తీసుకువెళ్లనున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీన ఎగరనున్న సోయేజ్ ఎంఎస్-19 వ్యోమనౌక ద్వారా ఆ నటులు అంతరిక్ష కేంద్రానికి వెళ్తారు. భూమికి సుమారు 350 కిలోమీటర్ల ఎత్తులో స్పేస్ స్టేషన్ సంచరిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు ఛాలెంజ్ అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశారు. ఈ ఫిల్మ్‌లో నటించే యాక్టర్లు ముందుగా జీరో గ్రావిటీ పరీక్షలు క్లియర్ చేయాల్సి ఉంటుంది. పారాచ్యూట్ శిక్షణ కూడా పొందాల్సి ఉంటుంది. ఈ నెల చివరలోగా ఆ నటులు తమ శిక్షణ స్టార్ట్ చేయనున్నారు. రష్యాకు చెందిన 36 ఏళ్ల నటుడు యులియా పెరిసిల్డ్, 37 ఏళ్ల క్లిమ్ షిపెంకో ప్రధాన సిబ్బందిలో ఉంటారు. 33 ఏళ్ల నటుడు అలెనా మోర్డవినో, కెమెరా డైరక్టర్ అలెక్సీ డుడిన్లు కూడా రిజర్వ్ క్రూగా వెళ్తారు.