Russia-Ukraine War | రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్ బలగాలు
ఉక్రెయిన్ బలగాలు సరిహద్దు దాటి తమ భూభాగంలోకి వచ్చాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోపించారు. ఉక్రెయిన్ మిస్సైళ్లు సహా వేర్వేరు ఆయుధాలతో నివాస భవనాలు, ఆంబులెన్సులపై దాడికి పాల్పడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. కర్స్ ప్రాంతంలోకి ఉక్రెయిన్ సైన్య ప్రవేశించినట్టు రష్యా రక్షణ శాఖ సైతం ఆరోపించింది.
- కీవ్‌పై వ్లాదిమిర్ పుతిన్ ఆరోపణ
- కాల్పులకు పాల్పడిందని వెల్లడి
Russia-Ukraine War | మాస్కో, ఆగస్టు 7: ఉక్రెయిన్ బలగాలు సరిహద్దు దాటి తమ భూభాగంలోకి వచ్చాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోపించారు. ఉక్రెయిన్ మిస్సైళ్లు సహా వేర్వేరు ఆయుధాలతో నివాస భవనాలు, ఆంబులెన్సులపై దాడికి పాల్పడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. కర్స్ ప్రాంతంలోకి ఉక్రెయిన్ సైన్య ప్రవేశించినట్టు రష్యా రక్షణ శాఖ సైతం ఆరోపించింది. రెండేళ్లుగా ఇరు దేశాల మధ్య సాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ తమ భూభాగంలోకి ప్రవేశించిందని రష్యా ఆరోపించడం ఇదే మొదటిసారి. సడ్ఝా పట్టణం వద్ద ఒకేసారి ఉపరితలం, వాయు మార్గాల్లో ఉక్రెయిన్ దాడికి పాల్పడినట్టు రష్యా అధికారవర్గాలు చెప్తున్నాయి. అయితే, ఇంకా రష్యా భూభాగంలోనే ఉక్రెయిన్ సైన్యం ఉందా అనే అంశంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా, ఉక్రెయిన్ కూడా ఈ విషయంపై స్పందించలేదు.
ట్రంప్ హత్యకు పాకిస్థానీ కుట్ర
వాషింగ్టన్, ఆగస్టు 7: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మరో ఇద్దరు రిపబ్లికన్ నేతలను హత్య చేయడానికి జరిగిన కుట్రను ఎఫ్‌బీఐ భగ్నం చేసింది. తమ దేశ నేతలను కిరాయి వ్యక్తులతో హత్య చేయడానికి కుట్ర జరిగిందని, దీని వెనుక ఇరాన్ హస్తం ఉందని ఎఫ్‌బీఐ ఆరోపించింది. ఈ కుట్రకు సంబంధించిన ఒక పాకిస్థాన్ దేశస్థుడిని అరెస్ట్ చేసినట్టు యూఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ మంగళవారం వెల్లడించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ఎడతెరిపి లేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. భద్రాద్రి జిల్లాలో జలమయమైన రహదారులు
Vijay | తమిళ సినీ పరిశ్రమకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్.. రోజుకు ఆరు షోలకు అనుమతి,కాని దానికి మాత్రం నో!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

