Dirty Bomb: డర్టీ బాంబ్‌పై రాజ్‌నాథ్‌తో ఫోన్లో మాట్లాడిన రష్యా రక్షణ మంత్రి
Dirty Bomb:ఉక్రెయిన్ డర్టీ బాంబ్‌ను వాడినట్లు రష్యా ఆరోపిస్తోంది. కీవ్‌లో ఆ బాంబు గురించి గుసగుసలు వినిపిస్తున్నట్లు రష్యా పేర్కొంటోంది. సంప్రదాయ పేలుడు పదార్ధాలతో అణుధార్మికత కలిగిన డర్టీ బాంబును ఉక్రెయిన్ రూపొందిస్తున్నట్లు రష్యా ఆరోపించింది. ఈ అంశంపై భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో రష్యా రక్షణ మంత్రి సె
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ డర్టీ బాంబ్(Dirty Bomb)ను వాడినట్లు రష్యా ఆరోపిస్తోంది. కీవ్‌లో ఆ బాంబు గురించి గుసగుసలు వినిపిస్తున్నట్లు రష్యా పేర్కొంటోంది. సంప్రదాయ పేలుడు పదార్ధాలతో అణుధార్మికత కలిగిన డర్టీ బాంబును ఉక్రెయిన్ రూపొందిస్తున్నట్లు రష్యా ఆరోపించింది. ఈ అంశంపై భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోగూ మాట్లాడారు. ఉక్రెయిన్‌లో జరుగుతున్న పరిణామాలపై సెర్గీ ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ రెచ్చగొడుతున్నట్లు ఆయన రాజ్‌నాథ్‌కు వెల్లడించినట్లు తెలుస్తోంది.
డర్టీ బాంబు గురించి రష్యా రక్షణ మంత్రి సెర్గీ ఆదివారం నాటో దేశాల రక్షణ మంత్రులతో మాట్లాడారు. కానీ ఉక్రెయిన్‌తో పాటు పశ్చిమ దేశాలు ఆ ఆరోపణలను తోసిపుచ్చుతున్నాయి. రేడియోయాక్టివ్ డర్టీ బాంబును వాడేందుకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉన్నట్లు రష్యా చేస్తున్న ఆరోపణల్ని నాటో దేశాలు ఖండించాయి. రష్యానే ఆ బాంబును వాడనున్నట్లు నాటో దేశాలు ప్రత్యారోపణలు చేశాయి.
ఉక్రెయిన్ వార్‌లో ఎవరు కూడా అణ్వాయుధాలను వాడరాదు అని సెర్గీతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ తెలిపారు. న్యూక్లియర్ లేదా రేడియోలాజికల్ వెపన్స్ వాడడం అంటే అది మానవాళికి విరుద్దమే అని రాజ్‌నాథ్ అన్నారు. సంప్రదింపులు, దౌత్యం ద్వారా సమస్యను త్వరగా పరిష్కరించుకోవాలని రష్యా రక్షణ మంత్రికి రాజ్‌నాథ్ సూచించారు.
అయితే అంతర్జాతీయ అణు ఇంధన ఏజెన్సీ(ఐఏఈఏ) ఉక్రెయిన్‌లో ఇన్స్పెక్షన్కు వెళ్లనున్న సమయంలో.. డర్టీ బాంబు ప్రణాళికల్ని ఉక్రెయిన్ గోప్యంగా ఉంచుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఉక్రెయిన్ డర్టీ బాంబును వాడే అవకాశాలు మెండుగా ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ డర్టీబాంబు వాడితే అది అణ్వాయుధ ఉగ్రవాదమే అవుతుందని యూఎన్ అభిప్రాయపడింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
గోల్డెన్ డ్రెస్‌లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
Mahasakthi | నయనతార ‘మహశక్తి’ ట్రైలర్ విడుదల.. ఆకట్టుకుంటున్న విజువల్స్!
RTC Conductors | డ్రైవర్లు రాలేదు.. మీరు సెలవు పెట్టి వెళ్లండి.. కండక్టర్లు విధుల్లోకి రాకుండా అడ్డుకున్న కుషాయిగూడ ఆర్టీసీ అధికారులు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

