Vladimir Putin | క్రెమ్లిన్‌పైకి దూసుకెళ్లిన రెండు డ్రోన్లు.. బంకర్లోకి రష్యా అధ్యక్షుడు పుతిన్
Vladimir Putin | రష్యా అధ్యక్ష భవన సముదాయం అయిన క్రెమ్లిన్‌పైకి రెండు డ్రోన్లు దూసుకురావడంతో ఆ దేశ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ముందుజాగ్రత్తగా అధ్యక్షుడు పుతిన్‌ను తన నివాసంలోని బంకర్లోకి తరలించారు.
మాస్కో: రష్యా అధ్యక్ష భవన సముదాయం అయిన క్రెమ్లిన్‌పైకి రెండు డ్రోన్లు దూసుకురావడంతో ఆ దేశ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ముందుజాగ్రత్తగా అధ్యక్షుడు పుతిన్‌ను తన నివాసంలోని బంకర్లోకి తరలించారు. నోవో – ఒగరెవో ప్రాంతంలోగల తన నివాసంలోని బంకర్లో ప్రస్తుతం పుతిన్ ఉన్నారు. ప్రస్తుతానికి అధ్యక్షుడు పుతిన్ బంకర్ నుంచి తన కార్యకలాపాలు నిర్వహిస్తారని స్థానిక మీడియా వెల్లడించింది.
కాగా, రష్యా రాజధాని మాస్కో నగరం నడిబొడ్డున ఉన్న క్రెమ్లిన్ భవనాలపైకి రెండు డ్రోన్లు దూసుకురావడం తీవ్ర కలకలం రేపింది. ఈ దాడి యత్నం వెనుక అగ్ర రాజ్యం అమెరికా హస్తం ఉందని రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. రష్యాలో ఎక్కడెక్కడ దాడి చేయాలనే విషయాలను ఉక్రెయిన్‌కు అమెరికా చెబుతోందని, అమెరికా సూచన మేరకు ఉక్రెయిన్ నడుచుకుంటోందని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ ఆరోపించారు.
ఉక్రెయిన్ తీరు మారకపోతే ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ, అతని బృందాన్ని హతమార్చడం తప్ప తమకు మరో అవకాశం లేదని రష్యా పేర్కొంది. జెలెన్ స్కీ లొంగిపోవాల్సిన అవసరం కూడా లేదని, దానికి ఏదో ఒక ప్రత్యామ్నాయం ఉంటుందని వ్యాఖ్యానించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

