బ్రిటీష్ ఎయిర్‌లైన్స్‌కి గగనతలాన్ని మూసేసిన రష్యా
మాస్కో: ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా, పశ్చిమ దేశాల ఆంక్షలను తిప్పికొడుతున్నది. తన గగనతలాన్ని బ్రిటీష్ ఎయిర్‌లైన్స్‌కి మూసేసింది. అలాగే రష్యా విమానాశ్రయాల్లో బ్రిటన్ విమానాల ల్యాండింగ్‌ను నిషేధించింది. రష్యా పౌర విమానయాన సంస్థ ఈ మేరకు శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ‘యూకేలో రిజిస్టర్ అయిన లేదా ఆ దేశంతో సంబంధం ఉన్న, లీజు ఒప్పందం ఉన్న విమానాలు రష్యా గగనతలాన్ని, ఎయిర్‌పోర్టులను వినియోగించడంపై ఆంక్షలు అమలు చేస్తున్నాం’ అని రోసావియాట్సియా ఏవియేషన్ అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. శుక్రవారం ఉదయం నుంచి ఈ నిషేధం అమలవుతుందని పేర్కొంది. యూకే ఏవియేషన్ అథారిటీ అననుకూల నిర్ణయాల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు వెల్లడించింది.
కాగా, ఉక్రెయిన్‌పై రష్యా దాడిని పశ్చిమ దేశాలు ఖండించాయి. అమెరికాతోపాటు ఈయూ కూటమి రష్యాపై పలు ఆర్థిక ఆంక్షలు విధించాయి. ఇందులో భాగంగా రష్యా విమానయాన సంస్థ ఏరోఫ్లాట్ విమానాలపై బ్రిటన్ నిషేధం విధించింది.
అయితే దీనికి ప్రతీకారంగా రష్యా చర్యలు చేపట్టింది. బ్రిటన్ విమానాలు తమ గగనతలాన్ని వినియోగించడంతోపాటు విమానాశ్రయాల్లో ల్యాండింగ్‌ను రష్యా నిషేధించింది. తమపై ఆంక్షలు విధించే దేశాలపై ప్రతీకార చర్యలు చేపడతామని ముందుగానే రష్యా హెచ్చరించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

