మాస్కో: ఉక్రెయిన్ దళాలకు రష్యా మరోసారి వార్నింగ్ ఇచ్చింది. తక్షణమే ఆయుధాలను వదిలివేయాలని కోరింది. మారియపోల్ నగరాన్ని రక్షించుకుంటున్న వారంతా ఆయుధాల్ని వీడాలని రష్యా తన వార్నింగ్‌లో పేర్కొన్నది. తూర్పు ప్రాంతాలపై భీకర దాడులు జరిగే ప్రమాదం ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్న తర్వాత రష్యా తాజాగా ఈ వార్నింగ్ ఇచ్చింది. ఉక్రెయిన్ ప్రభుత్వ అధికారులకు పిలుపు ఇస్తున్నామని, రక్షణ దళంగా మారిన ఫైటర్లు ఆయుధాలు వీడాలని రష్యా తన ప్రకటనలో తెలిపింది. ఉక్రెయిన్ అధికారులు ఎటువంటి ఆదేశాలు ఇవ్వరని, కానీ స్వచ్ఛంధ ఫైటర్లను ఉద్దేశించి తాము ఈ ప్రకటన చేస్తున్నామని, వారంతా ఆయుధాలను వీడాలని రష్యా పేర్కొన్నది. ఆయుధాలు వీడిన వాళ్లకు ప్రాణ హాని ఉండదని రష్యా రక్షణ దళం గ్యారెంటీ ఇచ్చింది.