లండన్: బ్రిటీష్ ప్రభుత్వానికి చెందిన రాయల్ నేవీ(Royal Navy)లో పనిచేస్తున్న ఫైటర్ పైలట్(Fighter Pilot) .. ఎఫ్-35 యుద్ధ విమానం(F-35 jet) నుంచి ప్రాణాలతో తృటిలో తప్పించుకున్నాడు. కూలిపోతున్న ఆ యుద్ధ విమానం నుంచి .. కొన్ని సెకన్ల తేడాతో ఎజక్ట్ అయినట్లు వెల్లడించాడు. నవంబర్ 2021లో రాయల్ నేవీ యుద్ధ నౌక నుంచి టేకాఫ్ తీసుకున్న పైలట్ హక్స్(Pilot Hux)కు ఊహించని పరిస్థితి ఎదురైంది. ఎఫ్-35 అకస్మాత్తుగా కూలడడం గ్రహించిన అతను.. చివరి క్షణాల్లో ఎజెక్ట్ సీటు నుంచి బయటపడినట్లు తెలిపాడు. ప్రభుత్వం చేపట్టిన దర్యాప్తులో ఆ ఘటనకు చెందిన వివరాలను ఆయన వెల్లడించాడు.
టేకాఫ్ తీసుకోగానే సడెన్గా పవర్ పోయిందని, విమానం కూలుతున్నట్లు గ్రహించిన తాను .. చివరి క్షణాల్లో హైస్పీడ్ ఎజెక్షన్ అయినట్లు చెప్పాడు. జెట్ లో ఎమర్జెన్సీ పవర్ పనిచేయలేదన్నాడు. ఎఫ్-35లో ఎజెక్టార్ సీటు చాలా అడ్వాన్స్డ్గా ఉందని, అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడినట్లు ఓ ఇంటర్వ్యూలో అతను తెలిపాడు. ఎఫ్-35 సముద్రంలో పడిన దృశ్యాలు యుద్ధనౌకపై ఉన్న కెమెరాలకు చిక్కాయి.