అచ్చం మనిషిని పోలిన రోబో.. దీని మిమిక్రీ అదుర్స్ : వైరల్ వీడియో

మీరు రోబో సినిమా చూశారా.. అందులో రజనీకాంత్ ఒక రోబోను తయారు చేస్తాడు. అది కూడా అచ్చం రజనీకాంత్‌లా ఉంటుంది. ఎటువంటి పనులైనా చేస్తుంది. కానీ.. దానికి హ్యూమన్ ఎమోషన్స్ ఉండవని.. అది దేనికీ పనికిరాదు అని తెలిసి దానికి హ్యూమన్ ఎమోషన్స్‌ను యాడ్ చేస్తాడు రజనీ. దీంతో అది అచ్చం మనిషిలా ఆలోచించడం మొదలు పెడుతుంది. మనిషిలా ప్రేమించడం.. ద్వేషించడం నేర్చుకుంటుంది.
అది సినిమా కదా.. అలాంటి రోబోలు నిజంగా ఉంటాయా అనే డౌట్ మనకు అప్పుడు వచ్చింది. కానీ.. నిజంగానే అటువంటి రోబోలు ఉంటాయి. వాటినే హ్యూమనాయిడ్ రోబోలు అంటారు. చాలా ఏళ్ల నుంచి హ్యూమనాయిడ్ రోబోలపై విస్తృతంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.
అచ్చం మనిషి రూపంలో ఉండే రోబోలు ఇప్పుడు దర్శనమిస్తున్నాయి. మనిషిలా నవ్వడం.. తల ఊపడం.. మనిషిలా ప్రవర్తించడం చేస్తున్నాయి. అలాంటి ఓ రోబో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈరోబోను చూస్తే అచ్చం మనిషిని చూసినట్టే ఉంటుంది.
🤖 A robot trying to replicate human emotions.pic.twitter.com/JXLZSUkWXu
— EHA News (@eha_news) January 13, 2022
ఎహా న్యూస్ అనే ట్విట్టర్ అకౌంట్లో రోబోకు సంబంధించిన ఈ వీడియోను షేర్ చేశారు. అందులో ఉండే రోబో పేరు అట్లాస్. మనిషి హావభావాలను పలికిస్తూ అందరినీ పలకరిస్తుంది ఈ రోబో. మనిషిలా మిమిక్రీ చేస్తుంది. దాని చేష్టలను చూసిన నెటిజన్లు వామ్మో ఇదేం రోబో బాబోయ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

