Robot Suicide | ఆత్మహత్య చేసుకున్న రోబో.. దక్షిణ కొరియాలో ఆసక్తికర ఘటన
దక్షిణ కొరియాలో ఆశ్చర్యపరిచే సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడి గుమి నగర కౌన్సిల్ కార్యాలయంలో సేవలందించే ఒక రోబో.. కౌన్సిల్ భవనం మెట్లదారిపై ధ్వంసమై పడిపోయింది.
Robot Suicide | సియోల్, జూలై 3: దక్షిణ కొరియాలో ఆశ్చర్యపరిచే సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడి గుమి నగర కౌన్సిల్ కార్యాలయంలో సేవలందించే ఒక రోబో.. కౌన్సిల్ భవనం మెట్లదారిపై ధ్వంసమై పడిపోయింది. అయితే, రోబో ఆత్మహత్య చేసుకుందనే ప్రచారం జరుగుతున్నది. రోబో దానికదే మెట్లపై నుంచి కింద పడిందని, ఇందుకు కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు. దీంతో దక్షిణ కొరియా వాసులు రోబో ఆత్మహత్య చేసుకుందని చెప్తూ సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేస్తున్నారు.
అయితే, ఈ ఘటనకు ముందు రోబో.. ఏదో వెతుకుతున్నట్టుగా అటూఇటూ తిరుగుతున్నదని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతామని, ముక్కలైన రోబో భాగాలను దానిని తయారుచేసిన కంపెనీకి పంపిస్తామని అధికారులు తెలిపారు.
దక్షిణ కొరియాలో రోబోలను విరివిగా వాడుతుంటారు. కాలిఫోర్నియాకు చెందిన ఓ కంపెనీ తయారుచేసిన ఈ రోబోను 2023 అక్టోబరు నుంచి గుమి నగర కౌన్సిల్లో వినియోగిస్తున్నారు. అధికారులకు డాక్యుమెంట్లు అందించడం, ప్రజలకు సమాచారం ఇవ్వడం వంటి పనులు చేసేది. కాగా, గతంలో వాషింగ్టన్లోనూ ఒక ఫౌంటెయిన్ వద్ద ఇదే రకంగా రోబో ధ్వంసమైంది. అప్పుడు కూడా రోబో ఆత్మహత్య చేసుకుందనే ప్రచారం జరిగింది. అయితే, అది జారిపడి ధ్వంసమైందని తర్వాత విచారణలో వెల్లడైంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ T20I | న్యూజిలాండ్తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

