NASA satellite: 38 ఏళ్ల తర్వాత నేలరాలనున్న నాసా శాటిటైల్
NASA Satellite భూమి అధ్యయనం కోసం నాలుగు దశాబ్ధాల క్రితం నాసా ప్రయోగించిన ఈఆర్బీఎస్ ఉపగ్రహం నేలరాలనున్నది. దాదాపు 38 ఏళ్ల తర్వాత ఆ శాటిలైట్(ఎర్త్ రేడియేషన్ బడ్జెట్ శాటిలైట్) రిటైర్‌కానున్నట్లు నాసా వెల్లడించంది. ఆకాశం నుంచి ఆ ఉపగ్రహం భూకక్ష్యలోకి ఎంటర్కానున్నది. ఆ తర్వాత అది మండిపోనున్న
కేప్ కెనరవల్: భూమి అధ్యయనం కోసం నాలుగు దశాబ్ధాల క్రితం నాసా ప్రయోగించిన ఈఆర్బీఎస్ ఉపగ్రహం నేలరాలనున్నది. దాదాపు 38 ఏళ్ల తర్వాత ఆ శాటిలైట్(ఎర్త్ రేడియేషన్ బడ్జెట్ శాటిలైట్) రిటైర్‌కానున్నట్లు నాసా వెల్లడించంది. ఆకాశం నుంచి ఆ ఉపగ్రహం భూకక్ష్యలోకి ఎంటర్కానున్నది. ఆ తర్వాత అది మండిపోనున్నది. దాదాపు 2450 కిలోల బరువు ఉన్న ఆ శాటిలైట్ భూ వాతావరణంలోకి ఎంటర్ కాగానే మండిపోతుందని, దాని శిథిలాలు ఎక్కడైనా పడే వీలు ఉన్నట్లు నాసా పేర్కొన్నది. మరికొన్ని శిథిలాల ఆ కక్ష్యలోనే ఉండిపోనున్నట్లు తెలుస్తోంది.
శాటిలైట్ శిథిలాల వల్ల ప్రమాదం జరిగే ఛాన్సు తక్కువ అని నాసా చెప్పింది. ఆదివారం రాత్రి ఆ ఉపగ్రహం కూలిపోనున్నది. ఆ ప్రక్రియకు దాదాపు 17 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు అమెరికా రక్షణ శాఖ తెలిపింది. ఆఫ్రికా, ఆసియా, మిడిల్ఈస్ట్ రూట్లో ఆ శాటిలైట్ కూలే ఛాన్సు ఉంది.
ఎర్త్ రేడియేషన్ బడ్జెట్ శాటిలైట్(ఈఆర్బీఎస్)ను 1984లో ప్రయోగించారు. ఛాలెంజర్ వ్యోమనౌక ద్వారా దాన్ని నింగిలోకి పంపారు. ఆ శాటిలైట్ జీవితకాలం రెండేళ్లే కానీ, దాదాపు 2005 వరకు అది సమాచారాన్ని ఇస్తూనే ఉన్నది. ఓజోన్‌తో పాటు ఇతర వాతావరణ పరిస్థితులపై ఆ శాటిలైట్ డేటాను షేర్ చేస్తూ వచ్చింది. సూర్యుడి, భూమి మధ్య సాగే ఎనర్జీ ట్రాన్స్‌ఫర్‌పై ఆ శాటిలైట్ స్టడీ చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

