Neuroprosthetic | కంటిలో సోలార్ ప్యానెల్స్!.. కంటిచూపు పునరుద్ధరణకు సరికొత్త ఆలోచన
వృద్ధాప్యం, కంటి సమస్యల కారణంగా కోల్పోయిన కంటిచూపును పునరుద్ధరించేందుకు ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు సరికొత్త ఆలోచన చేస్తున్నారు.
Neuroprosthetic | సిడ్నీ, మార్చి 10: వృద్ధాప్యం, కంటి సమస్యల కారణంగా కోల్పోయిన కంటిచూపును పునరుద్ధరించేందుకు ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు సరికొత్త ఆలోచన చేస్తున్నారు. న్యూరోప్రోస్టెటిక్ టెక్నాలజీ ద్వారా కంటిచూపును తీసుకురావచ్చని భావిస్తున్నారు. వినికిడి లోపం ఉన్న వారికి కోక్లియర్ ఇంప్లాంట్ ద్వారా చిన్న ఎలక్ట్రానిక్ పరికరాన్ని చెవి లోపలి భాగంలో అమర్చి వినికిడి నాడిని ప్రేరేపించి వినికిడి శక్తిని పెంచుతున్నట్టుగానే కంటిచూపునూ పునరుద్ధరించవచ్చని నమ్ముతున్నారు. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ మేరకు ప్రయత్నాలు ప్రారంభించారు.
కాంతిని గ్రహించే రెటీనాలోని కణాలు, ఫొటోరిసెప్టర్లు దెబ్బతిన్న వారిలో ఈ న్యూరోప్రొస్టెటిక్ టెక్నాలజీ ద్వారా కంటిచూపును పునరుద్ధరించే అవకాశం ఉందని వీరు చెప్తున్నారు. కనుబొమ్మలో కెమెరా సెన్సర్ చిప్‌ను పెట్టడం ద్వారా ఇది సాధ్యమవుతుందని భావిస్తున్నారు. అయితే, ఈ సెన్సర్‌ను ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి కనుబొమ్మలో అమర్చిన తర్వాత ఛార్జ్ చేయడం సాధ్యం కాదు. ఈ సమస్యకు పరిష్కారంగా కాంతిని విద్యుత్తుగా మార్చగలిగే అతి సూక్ష్మ సోలార్ ఫొటోవాైల్టెక్ ప్యానళ్లను కూడా కంటిలో అమర్చాలని భావిస్తున్నారు. ఈ రెండు టెక్నాలజీలను అనుసంధానం చేయడం ద్వారా కంటిచూపును పునరుద్ధరించవచ్చని చెప్తున్నారు. అయితే, ఇది ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

