ఇప్పుడు ప్రపంచం చూపు అంతా రష్యా- ఉక్రెయిన్‌పైనే. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ప్రపంచమే తీవ్ర ఉత్కంఠతలో ఉంది. ఈ నేపథ్యంలో అక్కడి పాత్రికేయులపైనే అందరి దృష్టీ వుంటుంది. ఎప్పటికప్పుడు జరిగే తాజా సమాచారాన్ని అందివాల్సిన బాధ్యతా వుంది. అయితే.. ఉక్రెయిన్ లో ఉండే ఓ రిపోర్టర్పైనే అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. ఆ ఒక్కడే 6 భాషల్లో రిపోర్టింగ్ చేస్తున్నాడు. అక్కడే వుంటూ చేస్తున్నాడు. దీంతో…. ఆయన సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతున్నాడు. స్థానికంగా ఉండే భాష.. ఇతర దేశాల వారికి అర్థం కాకపోవచ్చు. బహుశః ఈ విషయాన్ని ఆయన దృష్టిలో పెట్టుకున్నారో ఏమోగానీ… ఏకంగా ఆరు భాషల్లో రిపోర్టింగ్ చేస్తూ… బాగా పాపులర్ అయ్యాడు.
ఆ రిపోర్టర్ పేరు ఫిలిప్ క్రాథర్. ఈయన ఫిలిప్ అసోసియేటెడ్ ప్రెస్ గ్లోబల్ మీడియాకు ఆన్లైన్ రిపోర్టర్‌గా పనిచేస్తున్నాడు. ఫిలిప్ ప్రస్తుతం ఉక్రెయి రాజధాని కీవ్‌లో ఉంటున్నాడు. అక్కడి నుంచే ఇతర మీడియా సంస్థలకు కూడా పనిచేస్తున్నాడు. ఆరు రకాల భాషల్లో ఎప్పటికప్పుడు జరుగుతున్న అంశాలను అత్యద్భుతంగా అందిస్తున్నాడు. ఇంగ్లీష్, లగ్జంబర్గ్, స్పానిష్, పోర్చుగ్రీస్, ఫ్రెంచ్, జర్మన్…. ఇలా ఆరు భాషల్లో రిపోర్టింగ్ చేస్తున్నాడు. దీంతో నెటిజన్లు ఈయన్ను తెగ మెచ్చుకుంటున్నారు.
Six-language coverage from #Kyiv with @AP_GMS. In this order: English, Luxembourgish, Spanish, Portuguese, French, and German. pic.twitter.com/kyEg0aCCoT
— Philip Crowther (@PhilipinDC) February 21, 2022