లండన్, డిసెంబర్ 10: అన్ని రకాల ప్లాస్టిక్‌లను రీసైక్లింగ్ చేసే టెక్నాలజీని కెనడాకు చెందిన ప్లాస్టోనిక్స్, యూఎస్‌కు చెందిన ఎలమెంటల్ కంపెనీలు అభివృద్ధి చేశాయి. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో కొన్ని రకాల ప్లాస్టిక్‌లను రీసైక్లింగ్ చేయలేం. కానీ, ఈ కంపెనీలు అభివృద్ధి చేసిన టెక్నాలజీతో సాధారణ ప్లాస్టిక్, మిక్స్డ్ ప్లాస్టిక్, మట్టిలో కలిసిన, మురికిగా ఉన్న ప్లాస్టిక్‌లను సైతం రీసైక్లింగ్ చేయవచ్చు. తాము రూపొందించిన టెక్నాలజీతో ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టవచ్చని ఈ కంపెనీల నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.