New york | కుంగిపోతున్న న్యూయార్క్ నగరం.. ఆకాశహార్మ్యాలే కారణం
అమెరికా ముఖ్య నగరాల్లో ఒకటైన న్యూయార్క్ సిటీ మెల్ల మెల్లగా భూమిలోకి కుంగిపోతున్నదని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. నగరంలో ఆకాశాన్ని తాకేట్టు కట్టిన భవన నిర్మాణాలు, పెద్ద ఎత్తున భూగర్భజలాల వాడకం ఇందుకు కారణమని తెలిపింది.
New york | అమెరికా ముఖ్య నగరాల్లో ఒకటైన న్యూయార్క్ సిటీ మెల్ల మెల్లగా భూమిలోకి కుంగిపోతున్నదని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. నగరంలో ఆకాశాన్ని తాకేట్టు కట్టిన భవన నిర్మాణాలు, పెద్ద ఎత్తున భూగర్భజలాల వాడకం ఇందుకు కారణమని తెలిపింది. అధ్యయనంలోని అంశాల్ని ‘ఎర్త్స్ ఫ్యూచర్’ సైన్స్ జర్నల్ తాజాగా ప్రచురించింది. న్యూయార్క్‌లో 10లక్షలకుపైగా ఆకాశాన్ని తాకే భవనాలున్నాయి. వీటి బరువు సమారుగా 76,200 కోట్ల కిలోలుందని, భూ ఉపరితలంపై ఒత్తిడి ఏర్పడి నగరం ఏటా సగటున 1 నుంచి 2 మిల్లీమీటర్లు కుంగిపోతున్నదని, కొన్ని చోట్ల భవనాలు రెండు అడుగుల వరకు కుంగిపోయే అవకాశముందని పరిశోధకులు అంచనావేశారు.
‘సముద్రమట్టం మెల్ల మెల్లగా పైకి వస్తోన్న సంగతిని శాటిలైట్ చిత్రాలు చెబుతున్నాయి. భారీ తుఫాన్లు సంభవిస్తే పరిస్థితి దారుణంగా మారుతుంది. నగరానికి భీకరమైన ముప్పు వాటిల్లే ప్రమాదముంది’ అని అధ్యయనంలో సహ రచయిత టాప్ పార్సన్స్ చెప్పారు. మన్‌హట్టన్, బ్రూక్లీన్, క్వీన్స్ ప్రాంతాలు భూమిలో కుంగిపోతున్నాయని పరిశోధకులు తెలిపారు.


Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Protests | సర్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో మళ్లీ మొదలైన ఆందోళనలు.. పలువురు అరెస్ట్
Tharun Bhascker | ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా తరుణ్ భాస్కర్ క్రేజీ ఎంటర్టైనర్!
America | అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘స్పిరిట్’ సెట్స్ నుంచి సందీప్ రెడ్డి వంగా సర్ప్రైజ్ పోస్ట్
Haiku Movie | ‘హైకూ’ మూవీ రివ్యూ.. యూత్ ఫుల్ లవ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకునే జెన్ జీ ప్రేమకథ!
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

