Racism @ Buckingham Palace | వివాదంలో బ్రిటన్ రాజ ప్రసాదం.. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో జాత్యహంకార వ్యాఖ్యలు..
Racism @ Buckingham Palace | బ్రిటన్ రాజ ప్రసాదం మరో వివాదంలో చిక్కుకున్నది. రాజ ప్రసాదంలోని ముఖ్య వ్యక్తి ఒకరు నల్లజాతీయురాలిపై జాత్యంహకార వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. రేసిజం వ్యాఖ్య చేసిన వ్యక్తి రాజీనామా చేసినట్లు సమాచారం.
Racism @ Buckingham Palace | బ్రిటన్ రాజ ప్రసాదం మరోసారి వివాదంలో చిక్కుకున్నది. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో జాతిపరమైన వ్యాఖ్యలు వినిపించాయి. ఈ వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి రాజీనామా చేసినట్లుగా సమాచారం. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో ఓ నల్లజాతి మహిళ ఎన్గోజీ ఫులానీపై ఈ జాత్యహంకార వ్యాఖ్యలు ప్రిన్స్ విలియం గాడ్ మదర్ లేడీ సుజానే హస్సీ చేసినట్లుగా తెలుస్తున్నది. ఈ ఘటన బ్రిటన్ క్వీన్ కెమిల్లా కార్యక్రమంలో జరిగినట్లు వార్తలు వెలువడ్డాయి. గృహహింసకు గురవుతున్న మహిళలకు సంబంధించి sistah space తరఫున నిర్వహించిన కార్యక్రమం ఇది. గృహహింసకు గురైనవారి కోసం స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఎన్గోజీ ఫులానీయేనే జాత్యహంకార వ్యాఖ్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో జాత్యహంకార వ్యాఖ్యలు వినిపించడం ఇదే తొలిసారి కాదు. గతంలో కింగ్ చార్లెస్ చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ మార్క్లే కూడా ప్యాలెస్‌లో ఇదే మాదిరి జాత్యంహకార వ్యాఖ్యలకు గురయ్యారు.
గృహహింసకు గురైన మహిళలకు మద్దతుగా నిలిచేందుకు బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో బ్రిటన్ క్వీన్ కెమిల్లా కార్యక్రమాన్ని నల్లజాతీయురాలు ఎన్గోజీ ఫులానీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన గాడ్ మదర్ లేడీ సుజానే హస్సీ.. ఎన్గోజీని ఆఫ్రికాలోని ఏ ప్రదేశం నుంచి వచ్చావ్ అని అడిగింది. బదులుగా తాను బ్రిటన్ వాసిని అని ఎన్గోజి చెప్పింది. అయినప్పటికీ హస్సీ.. మరోసారి గుచ్చిగుచ్చి అడిగడంతో ఎన్గోజీ చిన్నబుచ్చుకున్నది. తాను నల్లజాతీయురాలిని అయినందునే ఇలాంటి వ్యాఖ్యలు వినాల్సి వస్తున్నదని ఎన్గోజీ విచారం వ్యక్తం చేసింది. ‘ఆమె ప్రశ్నించిన తీరు ఇంటరాగేషన్ మాదిరిగానే ఉన్నది. ఇది ముమ్మాటికీ సుదీర్ఘ జాత్యహంకారమే..’ అని ఎన్గోజీ బాధపడింది.
ఇలాఉండగా, ఈ వివాదంపై బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రతినిధి ఒకరు ప్రకటన జారీచేసి చింతిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న తాము పూర్తి వివరాలను నిర్ధారించేందుకు వెంటనే దర్యాప్తు జరుపుతామన్నారు. ఇలాంటి ఘటనలను అస్సలు అంగీకరించమని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధపెట్టినందుకు చింతిస్తున్నానని, క్షమాపణలు కోరుతున్నానని సదరు వ్యక్తి చెప్పినట్లు ప్రకటనలో తెలిపారు. కానీ, ఆ వ్యాఖ్యలు చేసిన వ్యక్తి పేరును మాత్రం ప్రకటనలో వెల్లడించలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

