Rabuka @ Fiji | ఫిజీ కొత్త ప్రధానిగా రబుకా.. 16 ఏండ్ల బైనిమరామ పాలనకు ముగింపు
Rabuka @ Fiji | ఫిజీ నూతన ప్రధానిగా సితవేని రబుకా పదవీ ప్రమాణం స్వీకరించారు. దీంతో 16 ఏండ్ల ఫ్రాంక్ బైనిమరామ పాలనకు ముగింపు పలికినట్లయింది. గతంలో రెండుసార్లు సైనిక తిరుగుబాట్లు చేసిన రబూకా.. రహస్య ఓటింగ్‌లో పైచేయి సాధించి ప్రధాని అయ్యారు.
Rabuka @ Fiji | ఫిజీ నూతన ప్రధానమంత్రిగా సితవేని రబుకా ప్రమాణ స్వీకారం చేశారు. 74 ఏండ్ల ఈ మాజీ సైనిక కమాండర్.. పార్లమెంట్ సభ్యుల మధ్య జరిపిన రహస్య ఓటింగ్‌లో ఒక్క ఓటు తేడాతో నెగ్గి ప్రధాని పీఠాన్ని అధిష్ఠించారు. దీంతో ఫ్రాంక్ బైనిమరామ 16 ఏండ్ల పాలనకు ముగింపు పలికినట్లయింది. రెండు సార్లు సైనిక తిరుగుబాటు చేసిన నాయకుడిగా రబుకా ఫిజీ చరిత్ర పుటల్లోకెక్కారు.
ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రబుకా నేతృత్వంలోని పీపుల్స్ అలయెన్స్ కూటమికి 29 సీట్లు రాగా, ప్రత్యర్థి బైనిమరామా కూటమికి 26 స్థానాలు దక్కాయి. అయినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటులో ప్రతిష్ఠంభన ఏర్పడింది. దీంతో ఓటింగ్ నిర్వహించారు. ఈ రహస్య ఓటింగ్‌లో రబూకా 28-27 తో గట్టెక్కారు. డిసెంబర్ 14 న సార్వత్రిక ఎన్నికల్లో బైనిమరామ అధికార ఫిజీ ఫస్ట్ పార్టీ పూర్తి మెజార్టీ సాధించడంలో విఫమైంది. ఆ తర్వాత రెండు రోజుల క్రితం మూడు ప్రతిపక్ష పార్టీలు రబూకా నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. 2006 తిరుగుబాటులో అధికారాన్ని చేజిక్కించుకుని అప్పటి నుంచి ఫిజీని బైనిమరామా పాలిస్తున్నాడు. సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీ రాకపోవడంతో బైనిమరామ ఓటమిని అంగీకరించేందుకు ససేమిరా అన్నారు. తుదకు రహస్య ఓటింగ్ నిర్వహించి రబూకాను ప్రధానిగా ఎంపికచేశారు.
1970 లో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఫిజీ నాలుగు తిరుగుబాట్లను చూసింది. 19 వ శతాబ్దం చివరలో, 20 శతాబ్దం ప్రారంభంలో భారత్ నుంచి 10 వేల మంది ఒప్పంద కార్మికులను తీసుకొచ్చేందుకు, దేశీయ ఫిజియన్ల ఆర్థిక కార్యకలాపాలను పరిమితం చేసే బ్రిటిష్ వలస విధానాల వారసత్వం పాక్షికంగా ఉన్నది. తొలి రెండు తిరుగుబాట్లకు రబూకా నాయకత్వం వహించారు. కాగా, సోషల్ డెమోక్రటిక్ లిబరల్ పార్టీ మద్దతు కారణంగా రబుకా తిరిగి అధికారంలోకి రావడం సాధ్యమైందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
Punjab | టోల్ ఫీ తప్పించుకునే యత్నంలో కారు బీభత్సం..!
Potassium | వ్యాయామం చేస్తున్నారా.. పొటాషియం ఉండే వీటిని తింటే మేలు..
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

