కొండచిలువలు విషం లేని పాములు. అయినప్పటికీ అవి భారీసైజులో ఉండడం వల్ల మనిషిని అమాంతం మింగేయగలవు. అలాగే, మనిషిని బలంగా చుట్టేసి ఊపిరాడకుండా చేసి, చంపేయగలవు. రెటిక్యులేటెడ్ పైథాన్లు ప్రపంచంలోనే అతి పొడవైన పాములు. ఇవి 20 అడుగుల కంటే ఎక్కువ పొడవు పెరుగుతాయి. కాగా, ఓ మనిషిని భారీ కొండచిలువ అమాంతం చుట్టేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియో చూసి నెటిజన్లు భయపడిపోతున్నారు.
ఈ వీడియోను ‘స్నేక్బైట్స్టీవీ’ అనే యూజర్ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. అమెరికాకు చెందిన సరీసృపాల పార్కు నిర్వాహకుడు ఓ భారీ కొండచిలువను దాని బోనులోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా, అది అతడిని చుట్టేసింది. అతికష్టంమీద దాన్ని అతడు తీసుకెళ్తున్నాడు. 20 అడుగుల పామును హ్యాండిల్ చేయడం అంటే అంత ఈజీకాదని, డబ్బులకోసం ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నానని అతడు పేర్కొన్నాడు. ఈ వీడియోను ఇప్పటివరకూ 7లక్షల 39వేల మంది వీక్షించారు. 20వేల లైక్స్ వచ్చాయి.