ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని అధికారికంగా ప్రకటించనున్న పుతిన్
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఆక్రమణను అధికారికంగా ప్రకటించనున్నారు. మే 9వ తేదీలోగా ఉక్రెయిన్‌పై అధికారికంగా పుతిన్ యుద్ధం ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వెల్లడించింది. ఈ చర్యలో భాగంగా రష్యా తన పూర్తి సైన్యాన్ని ఉక్రెయిన్ భూభాగంలోకి దించనున్నట్లు తెలుస్తోంది. మే 9వ తేదీన విక్టరీ డేను రష్యా జరుపుకుంటోంది. 1945లో ఆ రోజున నాజీలను రష్యా ఓడించింది. ఆ రోజున ఉక్రెయిన్‌లో సాధించిన సైనిక చర్య ఫలితాలను పుతిన్ వెల్లడించే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ పేరుతో ఫిబ్రవరి 24వ తేదీన రష్యా దాడికి దిగిన విషయం తెలిసిందే. కానీ ఇప్పటి వరకు ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్నట్లు కానీ, ఆక్రమణకు వెళ్లినట్లు కానీ పుతిన్ అధికారికంగా చెప్పలేదు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఓ యూదుడు కావడం వల్ల.. ఆ దేశంపై డీనాజిఫికేషన్‌లో భాగంగా దాడి చేపట్టినట్లు కూడా పుతిన్ వెల్లడించిన విషయం తెలిసిందే. మే 9వ తేదీన పుతిన్ చేసే ప్రకటనతో ఆ దేశం తన రిజర్వ్ దళాలను యుద్ధ రంగంలోకి దించే అవకాశాలు ఉన్నాయి. అయితే గత రెండు నెలలుగా సాగుతున్న వార్‌లో ఇప్పటి వరకు పది వేల మంది రష్యా సైనికులు చనిపోయి ఉంటారని పశ్చిమ, ఉక్రెయిన్ దేశ అధికారులు అంచనా వేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- declare war
- May 9
- Putin
- Russia
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

