Putin critics | పుతిన్‌ను విమర్శిస్తే అంతే సంగతి.. ఈ అంతుచిక్కని మరణాల వెనుక ఏదైనా కుట్ర ఉందా..?
Putin critics | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను విమర్శించిన వాళ్లు అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోతున్నారు. గత రెండు దశాబ్దాల్లో ఇలాంటి మరణాలు అనేకం సంభవించాయి. తాజాగా రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ (Alexey Navalny) కూడా మృతిచెందాడు. ఆయన మరణం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నావల్నీ మృతికి పుతిన్ కారణమని ఆయన భార్య, మద్దతుదారులు సహా అమెరికా, కెనడా దేశాలు ఆరోపిస్తున్నాయి.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను విమర్శించిన వాళ్లు అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోతున్నారు. గత రెండు దశాబ్దాల్లో ఇలాంటి మరణాలు అనేకం సంభవించాయి. తాజాగా రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ (Alexey Navalny) కూడా మృతిచెందాడు. ఆయన మరణం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నావల్నీ మృతికి పుతిన్ కారణమని ఆయన భార్య, మద్దతుదారులు సహా అమెరికా, కెనడా దేశాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్‌ను విమర్శిస్తే ఏదో ఒక రూపంలో మృత్యువు ముంచుకు రావడమనేది అంతుచిక్క,ని అంశంగా మారింది. ఈ మరణాల్లో పుతిన్ కుట్ర ఉందా..? లేదంటే యాదృచ్ఛికంగానే అలా జరుగుతుందా..? అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా ఉంది.
పుతిన్ హయాంలో ఆయనను విమర్శించిన ఎంతో మంది రాజకీయ, సామాజిక, వ్యాపార ప్రముఖులు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఎవరిని ఏ రూపంలో మృత్యువు కబలించిందో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రిగోజిన్ (Yevgeny Prigozhin)
రష్యా కిరాయి సైన్యంగా పేరొందిన వాగ్నర్ గ్రూప్‌నకు ప్రిగోజిన్ నాయకత్వం వహించాడు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో ఈ గ్రూప్ కీలకంగా వ్యవహరించింది. గత ఏడాది చివర్లో రష్యా సైనిక నాయకత్వంపై ప్రిగోజిన్ తిరుగుబాటు చేయడం సంచలనం సృష్టించింది. అయితే దీనిపై వెనక్కి తగ్గిన ప్రిగోజిన్ బెలారస్లో ఆశ్రయం పొందారు. పుతిన్, ప్రిగోజిన్ మధ్య గొడవ సద్దుమణిగిందని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో వెల్లడించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మరణించారు. పైలట్లు సహా అతడి అంగరక్షకులు 10 మంది ఈ ప్రమాదంలో మృతిచెందారు.
బోరిస్ నెమత్సోవ్ (Boris Nemtsov)
రష్యా ప్రధానిగా పనిచేసిన బోరిస్‌ను 2015లో క్రెమ్లిన్ దగ్గర్లోని మాస్కో వంతెన వద్ద కొంతమంది వ్యక్తులు కాల్చిచంపారు. ఈ ఘటనలో చెచెన్‌కు చెందిన ఐదుగురిని రష్యా భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. అయితే దీని వెనుక ఎవరున్నారనేది మాత్రం కనిపెట్టలేకపోయాయి. 2014లో క్రిమియాను ఉక్రెయిన్ నుంచి రష్యా స్వాధీనం చేసుకోవడంపై ప్రతిపక్షాలు చేపట్టిన నిరసనల్లో బోరిస్ పాల్గొన్నాడు. అంతేగాక పుతిన్ నిర్ణయాలపై తరచుగా విమర్శలు చేశాడు.
అన్నా పొలిట్కోవ్స్కాయ (Anna Politkovskaya)
రష్యన్ జర్నలిస్ట్ అన్నా పొలిట్కోవ్స్కాయను 2006లో ఆమె అపార్ట్మెంట్లో కొందరు దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. దేశాధ్యక్షుడు పుతిన్, చెచెన్ నాయకుడు రంజాన్ కదిరోవ్‌లపై తరచూ ఆమె విమర్శలు చేసేవారు. అప్పట్లో అన్నా మృతి తర్వాత రష్యాలో ప్రతికా స్వేచ్ఛపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.
అలెగ్జాండర్ లిట్వినెంకో (Alexander Litvinenko)
అలెగ్జాండర్ లిట్వినెంకో రష్యన్ ఫెడరల్ సెక్యూరిటీ ఏజెంట్‌గా పనిచేసేవారు. 1999లో మాస్కో అపార్ట్మెంట్ బాంబు దాడులకు పుతిన్ కారణమని ఆరోపించారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించారు. 2006లో లండన్‌లో ఇద్దరు రష్యన్ ఏజెంట్లతో కలిసి టీ తాగిన తర్వాత ఆయన మరణించారు. అలెగ్జాండర్ తాగిన టీలో విషం కలిపారనే వార్తలు అప్పట్లో గుప్పుమన్నాయి.
మరికొందరు కూడా..
వీళ్లేగాక మరికొందరు కూడా అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడగా.. ఇంకొందరు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. రష్యా వ్యాపారవేత్త, ఎంపీ ఆంటోవ్ 2022 డిసెంబరులో ఒడిశాలోని రాయగడ హోటల్లో మరణించారు. అంతకు కొద్దిరోజుల ముందు నౌకా రంగ దిగ్గజ వ్యాపారవేత్త అలెగ్జాండర్ బుజెకోవ్ ఒక సబ్‌మెరైన్ ఫ్లోటింగ్ ఫంక్షన్లో హఠాత్తుగా మృతిచెందారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన లుక్ ఆయిల్ ఛైర్మన్ రావిల్ మాగ్నోవ్.. గది కిటికీ నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైన రెండో రోజే గ్యాజ్‌ప్రామ్ యూనిఫైడ్ సెటిల్మెంట్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ అలెగ్జాండర్ ట్యూల్కోవ్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైన నాటి నుంచి పుతిన్ విమర్శకుల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. రష్యా అధికారులు వీటిని ఆత్మహత్యలు, ప్రమాదాలుగా చెబుతున్నారు. ఇప్పటివరకు అనుమానాస్పద రీతిలో లేదా హఠాత్తుగా వివిధ కారణాలతో మరణించిన రష్యా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఏదో ఒక సందర్భంలో పుతిన్‌పై విమర్శలు చేసిన వారే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Volga Videos | వోల్గా వీడియోస్ వ్యవస్థాపకుడి క్రెడిట్ కార్డు నుంచి రూ.34.44 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
Journalist Helle Lyng: కేంద్ర మంత్రి అమిత్‌షాకు వీడియో పోస్టు చేసిన నార్వే జర్నలిస్టు
Newborn baby | అప్పుడే పుట్టిన పసికందును రోడ్డుపై పడేసిన దుండగులు.. మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు
Drinking water | గుక్కెడు నీటి కోసం గుండెలవిసే ఆవేదన ..తాగునీటి కోసం రోడ్డెక్కిన జనం
గుడిసెలో ఆకస్మాత్తుగా చెలరేగిన మంటలు.. సకాలంలో స్పందించిన పోలీసులు, 108 సిబ్బంది
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

