Venezuela violence | అధ్యక్ష ఎన్నికకు వ్యతిరేకంగా వెనిజులాలో ఆందోళనలు.. పోలీస్ కాల్పుల్లో 11 మంది మృతి
Venezuela violence | వెనిజులా దేశాధ్యక్షుడిగా మళ్లీ నికోలస్ మడురో (Nicolas Maduro) విజయం సాధించడంతో.. ఆ ఎన్నికను వ్యతిరేకిస్తూ ప్రజలు దేశవ్యాప్తంగా మరోసారి ఆందోళనలు చేపట్టారు. గత నాలుగు రోజులుగా ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిరసనకారులను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు వారిపై టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగిస్తున్నారు.
Venezuela violence : వెనిజులా దేశాధ్యక్షుడిగా మళ్లీ నికోలస్ మడురో (Nicolas Maduro) విజయం సాధించడంతో.. ఆ ఎన్నికను వ్యతిరేకిస్తూ ప్రజలు దేశవ్యాప్తంగా మరోసారి ఆందోళనలు చేపట్టారు. గత నాలుగు రోజులుగా ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిరసనకారులను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు వారిపై టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగిస్తున్నారు. ఈ ఘటనల్లో ఇప్పటిరకు 11 మంది ఆందోళనకారులు మరణించారు.
దేశ రాజధాని సెంట్రల్ కరాకాస్‌లో వేల మంది ప్రదర్శన చేపట్టారు. మురికి వాడల నుంచి, పర్వత ప్రాంతాల నుంచి కూడా జనం కొన్ని మైళ్ల దూరం జనం నడిచివచ్చి ఆందోళనలో పాల్గొన్నారు. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ మార్గంలో ర్యాలీ తీశారు. ఎన్నికల్లో గెలిచినట్లు మాడురో ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు ఆందోళనకు దిగారు. ఫలితాల్లో మోసం జరిగినట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి.
ప్రతిపక్ష నేత ఎడ్ముండో గొంజాలేజ్ 73.2 శాతం ఓట్లతో గెలుపొందినట్లు ప్రతిపక్షాలు చెబుతున్నాయి. 11 ఏళ్లుగా అధికారంలో ఉన్న మడురోను గద్దె దించేందుకు .. ఈసారి ప్రతిక్షాలు ఒక్కటయ్యాయి. ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు, ఎన్నికకు వ్యతిరేకంగా ప్రజల ఆందోళనల నేపథ్యంలో పోలింగ్ స్టేషన్లకు చెందిన ఓటింగ్ రికార్డులను రిలీజ్ చేయాలని పశ్చిమ, లాటిన్ అమెరికా దేశాలు డిమాండ్ చేశాయి.
మాడురో ఎన్నికను అర్జెంటీనా కూడా వ్యతిరేకించింది. బ్యూనస్ ఎయిరిస్‌లో ఉన్న వెనిజులా దౌత్యవేత్తలను రీకాల్ చేసింది. చిలీ, కోస్టారికా, పనామా, పెరూ, డామినికన్ రిపబ్లిక్, ఉరుగ్వే దేశాల్లో ఉన్న వెనిజులా దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించారు. పనామా, డామినికన్ రిపబ్లిక్ దేశాలకు వెళ్లాల్సిన విమానాలను కూడా వెనిజులా రద్దు చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తుంగతుర్తిలో నలుగురికి కుష్టు వ్యాధి నిర్ధారణ
‘కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలి’
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
Burglars loot jewellery showroom | నిన్న తనిష్క్, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

