Prince Harry Spare | రేపే ప్రిన్స్ హ్యారీ ఆటోబయోగ్రఫి విడుదల.. ‘స్పేర్’ కోసం పుస్తకప్రియుల ఎదురుచూపులు
Prince Harry book | ప్రిన్స్ హ్యారీ జ్ఞాపకాలు ‘స్పేర్’గా పుస్తకబద్దం కానున్నాయి. ఈ పుస్తకాన్ని ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ ద్వారా రేపు విడుదల చేయనుననారు. పలు విషయాలు లీక్ కావడంతో నష్టాలపై ప్రచురణ సంస్థ పెంగ్విన్ భయంతో ఉన్నది.
Prince Harry book | ప్రిన్స్ హ్యారీ ఆటోబయోగ్రఫిగా మన ముందుకొస్తున్న పుస్తకం ‘స్పేర్’ కోసం పుస్తకప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అమెజాన్‌లో రేపు ఈ పుస్తకాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. విడుదలకు ముందే ఈ పుస్తకం బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. ఈ పుస్తకం ఒప్పందం ద్వారా ప్రిన్స్ హ్యారీ రూ.164 కోట్లు రాయల్టీ పొందనున్నారు. మేఘన విషయంలో అన్న విలియం తనను కాలర్ పట్టుకుని మరీ కొట్టాడనే పలు ఆసక్తికర విషయాలను ఇటీవల ప్రిన్స్ హ్యారీ వెల్లడించారు. దాంతో ఈ పుస్తకం ఎప్పుడు విడుదల అవుతుందా అని పుస్తకప్రియులు ఎదురుచూస్తున్నారు. దాంతో ఈ పుస్తకం విడుదలకు ముందే హాట్ సెల్లర్ బుక్‌గా నిలిచి కొత్త రికార్డును సొంతం చేసుకున్నది.
ఈ పుస్తకాన్ని పెంగ్విన్ రాండమ్ హౌజ్ ప్రచురించింది. పుస్తకంలో ఫలానా విషయాలు ఉండనున్నాయని నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీలలో ఇదివరకే లీక్ కావడంతో నష్టాల భయం పెంగ్విన్‌ను పట్టుకున్నది. పెంగ్విన్‌కు లాభాలు రావాలంటే దాదాపు 1.7 మిలియన్ పుస్తకాలు అమ్ముడవ్వాలని పరిశీలకులు భావిస్తున్నారు. తన జ్ఞాపకాలను ప్రజలతో పంచుకునేందుకు ప్రిన్స్ హ్యారీ ఇప్పటికే రూ.164 కోట్లు అందుకున్నాడు. ప్రిన్స్ హ్యారీతో 4 పుస్తకాల కోసం పెంగ్విన్ సంస్థ ఒప్పందం చేసుకున్నది. ఇందులో తొలి పుస్తకంగా ‘స్పేర్’ రానుండగా.. మరొకటి తన భార్య మేఘన్‌తో కలిసి రాయనున్నారు. మిగిలిన రెండు పుస్తకాల్లో ఒకటి నాయకత్వం, ఇంకొకటి మానవ సంక్షేమానికి సంబంధించినవిగా తెలుస్తున్నది. ఈ పుస్తకం ఘోస్ట్ రైటర్‌కు రూ.8.23 కోట్లు చెల్లించినట్లు సమాచారం.
ప్రిన్స్ హ్యారీ తన బయోగ్రఫి బుక్ ‘స్పేర్’ ను గత ఏడాదే విడుదల చేయాలని తొలుత నిర్ణయించారు. కొన్ని కారణాల వల్ల విడుదల వాయిదా పడటంతో డయానాకు సంబంధించిన విషయాలు కూడా రాసే అవకాశం ఉన్నదని అంతా అనుకుంటున్నారు. అలాగే ఇటీవల చనిపోయిన ఎలిజబెత్ మహారాణి జ్ఞాపకాలను కూడా పొందుపర్చనున్నట్లు అంతా భావిస్తున్నారు. ప్రిన్స్ చార్లెస్, డయానాల మొదటి సంతానమైన ప్రిన్స్ హ్యారీ డ్యూక్ ఆఫ్ సస్సెక్స్‌గా ఉన్నారు. ఎలిజబెత్ రాణి మరణానంతరం ఈయన తండ్రి ప్రిన్స్ చార్లెస్ ఇంగ్లండ్ రాజుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ పుస్తకంపై పుస్తకప్రియులకు ఆసక్తి పెరిగింది. ఇందులో రాజ కుటుంబానికి చెందిన వారసత్వం, విడిపోవడాలకు సంబంధించిన అంశాలు ఉండే అవకాశాలు లేకపోదని భావిస్తున్నారు. అలాగే, ప్రిన్స్ హ్యారీ చిన్ననాటి విశేషాలు, రాయల్ జీవితం, మిలిటరీ ఉద్యోగం, మేఘన్‌తో వివాహం, తండ్రిగా అనుభవం.. వంటి అంశాలు ఉండనున్నాయి. రాజకుటుంబంలో పుట్టిన వ్యక్తిగా కాకుండా మారిన వ్యక్తిగా ఈ పుస్తకం రాస్తున్నట్లు ఇదివరకే ప్రిన్స్ హ్యారీ ప్రకటించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

