Prince Harry SPARE | ప్రిన్స్ హ్యారీ పుస్తకం ‘స్పేర్’ జనవరి 10 న విడుదల.. కోట రహస్యాలు బయటపడేనా?
Prince Harry SPARE | ప్రిన్స్ హ్యారీ కలం నుంచి జాలువారిన పుస్తకం ‘స్పేర్’ వచ్చే ఏడాది జనవరి 10 న విడుదలకు ముహూర్తం ఖరారైంది. రాజకుటుంబానికి సంబంధించిన పలు ఆసక్తికర అంశాలు ఉంటాయని పుస్తక ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Prince Harry SPARE | ప్రిన్స్ హ్యారీ రాసిన పుస్తకం ‘స్పేర్’ విడుదల తేదీ ఖరారైంది. ఈ పుస్తకాన్ని వచ్చే ఏడాది జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఎలిజబెత్ రాణి నుంచి మొదలుకొని తల్లి డయానా మరణం వరకు ఎన్నో అంశాలను ఈ పుస్తకంలో స్పృశించే అవకాశాలు ఉంటాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఎలిజబెత్ రాణి మరణం తర్వాత ఈ పుస్తకం విడుదల అవుతుండటంతో విండ్సర్ ప్లాజాలో చోటుచేసుకున్న సన్నివేశాలను చదివేందుకు పుస్తక ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రిన్స్ హ్యారీ బుక్ ‘స్పేర్’ ను ఈ ఏడాదే విడుదల చేయాలని తొలుత భావించారు. అయితే కొన్ని కారణాల వల్ల విడుదలను వాయిదా వేశారు. ఇప్పుడు జనవరి 10 వ తేదీని ఖరారు చేశారు. ఈ పుస్తకం విడుదల ఆలస్యంగా జరుగుతుండటంతో ఇటీవల చనిపోయిన ఎలిజబెత్ మహారాణికి సంబంధించిన జ్ఞాపకాలను కూడా పొందుపర్చనున్నట్లు తెలుస్తున్నది. అలాగే, తన తల్లి డయానాకు సంబంధించిన విషయాలు కూడా ఉంటాయని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రిన్స్ చార్లెస్, డయానాల మొదటి సంతానం అయిన ప్రిన్స్ హ్యారీ డ్యూక్ ఆఫ్ సస్సెక్స్‌గా ఉన్నారు. ఎలిజబెత్ రాణి మరణానంతరం ఈయన తండ్రి ప్రిన్స్ చార్లెస్ ఇంగ్లండ్ రాజుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ పుస్తకంపై పుస్తకప్రియులకు ఆసక్తి పెరిగింది. ఇందులో రాజకుటుంబానికి చెందిన వారసత్వం, విడిపోవడాలకు సంబంధించిన అంశాలు ఉండే అవకాశాలు లేకపోదని భావిస్తున్నారు.
ఈ పుస్తకంలో ప్రిన్స్ హ్యారీ చిన్ననాటి విశేషాలు, రాయల్ జీవితం, మిలిటరీ ఉద్యోగం, మేఘన్‌తో వివాహం, తండ్రిగా అనుభవం.. వంటి అంశాలు ఉండనున్నాయి. రాజకుటుంబంలో పుట్టిన వ్యక్తిగా కాకుండా మారిన వ్యక్తిగా ఈ పుస్తకం రాస్తున్నట్లు ఇదివరకే ప్రిన్స్ హ్యారీ ప్రకటించారు. కాగా, ఈ పుస్తకాన్ని పెంగ్విన్ రాండమ్ హౌజ్ ప్రచురిస్తున్నది. 35 మిలియన్ పౌండ్ల విలువ చేసే నాలుగు పుస్తకాలు – ‘ఖచ్చితమైన జ్ఙాపకాలు’ – ఒప్పందంలో భాగంగా 17.5 మిలియన్ పౌండ్లు (20 మిలియన్ అమెరికన్ డాలర్స్) అడ్వాన్స్‌గా అందుకున్నట్లు వెల్లడైంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

