Nepal PM | కూలిపోయిన నేపాల్ ప్రభుత్వం.. విశ్వాస పరీక్షలో ఓడిన ప్రచండ
Nepal PM | అస్థిర రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నేపాల్‌లో మరోసారి ప్రభుత్వం కూలిపోయింది. ప్రభుత్వంపై పెట్టిన విశ్వాస తీర్మానంలో ప్రస్తుత ప్రధాని పుష్ప కమల్ దహల్ (ప్రచండ) ఓడిపోయారు. ప్రభుత్వానికి మద్దతుగా 63 మంది నిలువగా, వ్యతిరేకంగా 194 ఓట్లు వచ్చాయి.
Nepal PM : అస్థిర రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నేపాల్‌లో మరోసారి ప్రభుత్వం కూలిపోయింది. ప్రభుత్వంపై పెట్టిన విశ్వాస తీర్మానంలో ప్రస్తుత ప్రధాని పుష్ప కమల్ దహల్ (ప్రచండ) ఓడిపోయారు. ప్రభుత్వానికి మద్దతుగా 63 మంది నిలువగా, వ్యతిరేకంగా 194 ఓట్లు వచ్చాయి. 275 సీట్లు కలిగిన నేపాల్ పార్లమెంటులో ప్రభుత్వ ఏర్పాటుకు 138 ఓట్ల మెజార్టీ అవసరం.
మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని పార్టీ నేపాల్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రధాని ప్రచండ విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రచండ 2022 డిసెంబర్ 25న నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. మాజీ ప్రధాని ఓలీ నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ (CPN-UML) తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఈ క్రమంలో ప్రచండ ఇప్పటికే మూడుసార్లు విశ్వాసం ఎదుర్కొన్నారు. అయితే నేపాలీ కాంగ్రెస్‌తో ముందస్తుగా చేసుకున్న అధికార బదలాయింపు ఒప్పందం ప్రకారం ఆయన ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంది. కానీ అందుకు ప్రచండ నిరాకరించడంతో విశ్వాసం అనివార్యమైంది. నేపాలీ కాంగ్రెస్ 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలువగా, సీపీఎన్-యుఎంఎల్‌కు 78 మంది సభ్యుల బలం ఉంది.
వీరిద్దరూ కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు. తదుపరి ప్రధానిగా ఓలి బాధ్యతలు చేపట్టేందుకు నేపాలీ కాంగ్రెస్ ఇప్పటికే అంగీకరించినట్లు తెలిసింది. మొత్తంగా నేపాల్‌లో గడిచిన పదహారేళ్లలో 13 ప్రభుత్వాలు మారడం అక్కడి రాజకీయ అస్థిరతకు నిదర్శనంగా చెప్పవచ్చు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

