బీరూట్: లెబనాన్‌లో విద్యుత్ గ్రిడ్ కుప్పకూలింది. దేశంలోని రెండు ప్రధాన విద్యుదుత్పత్తి కేంద్రాలైన జహ్రానీ, దీర్ అమ్మార్లో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ఇంధనం నిండుకోవడంతో పవర్ జనరేషన్ ఆగిపోయింది. దీంతో దేశం అంతా చీకటిలోకి జారిపోయింది. అక్కడ ఇప్పుడు 200 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతుంది. లెబనాన్‌లో ఇప్పటికే ద్రవ్యోల్బణం పెరిగింది. నిత్యావసరాలకు కొరత ఉంది. విద్యుత్ గ్రిడ్ కుప్పకూలడం పరిస్థితిని మరింత దిగజార్చింది. ఇంధన సరఫరాకు ఈజిప్టు నుంచి లెబనాన్‌కు గ్యాస్ పైప్‌లైన్‌ను వేయాలని లెబనాన్‌లోని అమెరికా రాయబారి ప్రతిపాదించారు.