వాటికన్ సిటీ : పశ్చిమాసియా యుద్ధానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్, పోప్ లియో XIV మధ్య వివాదం ముదురుతున్నది. ట్రంప్ తనపై చేసిన విమర్శలను పోప్ సోమవారం తిప్పి కొట్టారు. శాంతి, సయోధ్య కోసం వాటికన్ చేస్తున్న విజ్ఞప్తులు సువార్త(జీసస్ బోధన) మూలాల్లోనే ఉన్నాయని తెలిపారు. తాను ట్రంప్ ప్రభుత్వానికి భయపడనని మీడియాతో అన్నారు. సువార్త సందేశాన్ని ట్రంప్ సరిగా అర్థం చేసుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు.
అయితే ప్రస్తుత ప్రపంచంలో చర్చి లక్ష్యం(శాంతి సందేశం) ఏమిటో చెప్పడం తాను కొనసాగిస్తానన్నారు. కొందరు సర్వ శక్తిమంతులమని భ్రమ పడుతున్నారని తాను చేసిన విమర్శ ట్రంప్ లేదా మరెవరిపై ప్రత్యక్ష దాడి కాదని అమెరికా నుంచి తొలిసారి పోప్ అయిన లియో తెలిపారు. తీవ్రవాద వామపక్షాలను ప్రసన్నం చేసుకోవడం పోప్ ఆపాలని, ఆయన మంచి పని చేయడం లేదని ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై పోప్ ఈ విధంగా స్పందించారు.