Afghanistan: అక్కడ మారణహోమం జరగబోతోంది.. దయచేసి ఆపండి!
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )కు తనను తాను తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకొని.. తర్వాత దేశం విడిచిపెట్టి వెళ్లిపోయిన అమ్రుల్లా సలేహ్.. ఇప్పుడు ఐక్యరాజ్య సమితికి ఓ లేఖ రాశారు.

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )కు తనను తాను తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకొని.. తర్వాత దేశం విడిచిపెట్టి వెళ్లిపోయిన అమ్రుల్లా సలేహ్.. ఇప్పుడు ఐక్యరాజ్య సమితికి ఓ లేఖ రాశారు. ఆఫ్ఘన్లో ఇప్పటికీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లకుండా పోరాడుతున్న పంజ్‌షిర్‌లో మారణహోమం జరగబోతోందని, దయచేసి దీనిని ఆపాలంటూ ఆయన వేడుకున్నారు. ఈ మేరకు తాను రాసిన లేఖను ఆదివారం ట్విటర్లో పోస్ట్ చేశారు. అక్కడ మానవతావాద విపత్తు సంభవించబోతోందని అమ్రుల్లా అభిప్రాయపడ్డారు. ఈ సంక్షోభంపై ఐక్యరాజ్య సమితితోపాటు ఇతర అంతర్జాతీయ ఏజెన్సీలు వేగంగా స్పందించాలని కోరారు.
కాబూల్‌తోపాటు దేశంలోని ఇతర నగరాలు తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయిన తర్వాత మహిళలు, వృద్ధులు, పిల్లలు సహా సుమారు రెండున్నర లక్షల మంది పంజ్‌షిర్ లోయల్లో తలదాచుకుంటున్నారు. ఒకవేళ వీళ్లను వెంటనే కాపాడలేకపోతే అక్కడ ఓ పెద్ద మానవ హక్కుల ఉల్లంఘన, మానవతావాద విపత్తు సంభవించే ప్రమాదం ఉంది. ఆకలికేకలతో చనిపోవడంతోపాటు పెద్ద ఎత్తున మారణహోమం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అని తన లేఖలో అమ్రుల్లా రాశారు.
రెండు దశాబ్దాల ఘర్షణలు, ప్రకృతి విపత్తులు, రోగాలు, కొవిడ్-19 మహమ్మారి, తిరిగి దేశం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడంతో ప్రపంచంలోనే అతిపెద్ద మానవతావాద సంక్షోభం ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్‌లో నెలకొన్నది అని కూడా అమ్రుల్లా అన్నారు. 30 లక్షల మంది దేశంలో చెల్లాచెదురయ్యారు. కోటి 80 లక్షల మంది ఆహారం కోసం, మనుగడ కోసం పోరాడుతున్నారు. పంజ్‌షిర్ ప్రావిన్స్‌లో తాలిబన్ల ఊచకోతను ఆపాలని యూఎన్‌ను వేడుకుంటున్నాను అని అమ్రుల్లా అన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

