Watch: రన్‌వే నుంచి దూసుకెళ్లి ఫెన్సింగ్‌ను ఢీకొన్న విమానం.. తర్వాత ఏం జరిగిదంటే?
Plane veers off runway | ఒక విమానం రన్‌వే నుంచి పక్కకు దూసుకెళ్లింది (Plane veers off runway). ఫెన్సింగ్‌ను అది ఢీకొట్టి ముక్కలైంది. అయితే అదృష్టవశాత్తు విమానంలోని సిబ్బంది, ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు.
మొగదీషు: ఒక విమానం రన్‌వే నుంచి పక్కకు దూసుకెళ్లింది (Plane veers off runway). ఫెన్సింగ్‌ను అది ఢీకొట్టి ముక్కలైంది. అయితే అదృష్టవశాత్తు విమానంలోని సిబ్బంది, ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. సొమాలియా రాజధాని మొగదీషులో ఈ మిరాకిల్ జరిగింది. జూలై 11న మధ్యాహ్నం 12:23 గంటలకు హల్లా ఎయిర్‌లైన్‌కు చెందిన ఈ 120 విమానం క్రాష్ ల్యాండ్‌కు ప్రయత్నించింది. రాజధాని మొగదీషులోని అడెన్ అడ్డే అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్ వేపై దిగుతుండగా ఆ విమానం అదుపుతప్పింది. రన్ వేకు ఒక పక్కగా ఉన్న ఫెన్సింగ్ వైపు వేగంగా దూసుకెళ్లింది. ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన ఆ విమానం పలు ముక్కలైంది. దాని రెక్కలు విరిగిపోయాయి. టైర్లు ఊడిపోయాయి. అయినప్పటికీ ఆ విమానం సిబ్బందితోపాటు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఇద్దరు స్వల్పంగా గాయపడినట్లు సొమాలి సివిల్ ఏవియేషన్ అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో సిబ్బంది, ప్రయాణికులు కలిపి మొత్తం 34 మంది ఆ విమానంలో ఉన్నట్లు చెప్పారు.
కాగా, ఈ విమాన ప్రమాదంపై సొమాలి సివిల్ ఏవియేషన్ అథారిటీ (ఎస్సీఏఏ) దర్యాప్తునకు ఆదేశించింది. విమానం రన్ వే నుంచి పక్కకు ఎందుకు వెళ్లిందో అన్నదానికి సరైన కారణం తెలియలేదని పేర్కొంది. పైలట్ కూడా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు ఎలాంటి ఫిర్యాదులు చేయలేదని తెలిపింది. దర్యాప్తు తర్వాతే అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పింది. మరోవైపు విమానం అదుపు తప్పి రన్ వే నుంచి పక్కకు దూసుకెళ్లి ఫెన్సింగ్‌ను ఢీకొని ముక్కలైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Video of aircraft type E120, operated by HALLA AIRLINE, crash landing on Runway 05 at Aden Ade International Airport (AAIA) today, at 12:23pm local time.
All 34 crew and passengers on board have survived according to the Somali Civil Aviation Authority . One person suffered… pic.twitter.com/tMrX7mcxsY
— Harun Maruf (@HarunMaruf) July 11, 2023
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

