e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home అంతర్జాతీయం ఆడపిల్ల పుట్టిందని సంకేతమిస్తూ.. నీటిలో కూలిన విమానం

ఆడపిల్ల పుట్టిందని సంకేతమిస్తూ.. నీటిలో కూలిన విమానం

ఆడపిల్ల పుట్టిందని సంకేతమిస్తూ.. నీటిలో కూలిన విమానం

మెక్సికో సిటీ: ఆడపిల్ల పుట్టిందని సంకేతమిస్తూ గులాబీ రంగు పొగ వెదజల్లిన చిన్న విమానం అంతలోనే నీటిలో కూలిపోయింది. మెక్సికోలోని కాన్కన్ నగరంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. ఒక కుటుంబంలో జన్మించిన బిడ్డ పాపనా లేక బాబునా అన్నది బంధువులకు తెలియజేసే ‘జండర్ రివీల్‌’ పార్టీని ఏర్పాటు చేశారు. దీని కోసం చిన్న విమానాన్ని అద్దెకు తీసుకున్నారు. పుట్టిన బిడ్డ పాప అని తెలియజేసే గులాబీ రంగు పొగను ఆ విమానం విడుదల చేసింది. అంతలోనే అది అదుపుతప్పి కరీబియన్ సముద్రం సమీపంలోని నీటి మడుగులో కూలిపోయింది.

ఈ ప్రమాదంలో విమానంలోని పైలట్‌తోపాటు కో పైలట్‌ చనిపోయారు. వెంటనే అక్కడకు చేరుకున్న సహాయక బృందాలు వారి మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆ సమయంలో బోటులో ప్రయాణించిన వారు విమానం కూలిన ఘటనను వీడియో తీశారు. దీంతో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది.

Advertisement
ఆడపిల్ల పుట్టిందని సంకేతమిస్తూ.. నీటిలో కూలిన విమానం
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement