Gender Reveal Party | పుట్టబోయే బిడ్డ గురించి వెల్లడించేందుకు ఏర్పాటు చేసిన ఓ వేడుక విషాదాంతమైంది. పార్టీకి వచ్చిన అతిథులను అలరించేందుకు ఏర్పాటు చేసిన ఓ స్టంట్ ప్లేన్ ప్రమాదవశాత్తు కుప్పకూలి (Plane Crashes) పైలట్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మెక్సికో (Mexico)లో సెప్టెంబర్ 2న చోటు చేసుకుంది.
సాన్పెడ్రో (San Pedro) ప్రాంతానికి చెందిన ఓ మహిళ గర్భం దాల్చింది. మరికొన్ని రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. దీంతో ఆ మహిళ తన భర్తతో కలిసి ఈ ఆనంద క్షణాల్ని బంధుమిత్రులతో పంచుకోవాలనుకుంది. ఈ నేపథ్యంలో పుట్టబోయే బిడ్డ గురించి ప్రకటించేందుకు ‘జెండర్ రివీల్’ (Gender Reveal ) పేరిట ఓ పార్టీని ఏర్పాటు చేసింది. ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. పార్టీని గ్రాండ్ గా చేయాలనే ఉద్దేశ్యంతో ఆ జంట ప్రత్యేకంగా ఓ స్టంట్ విమానాన్ని ఏర్పాటు చేసింది. పార్టీలో భాగంగా ఆ విమానం కాబోయే తల్లిదండ్రుల దగ్గరా వచ్చి పింక్ కలర్‌ను వెదజల్లింది.
అనంతరం గాల్లో ఎగురుతూ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కళ్లముందే విమానం కుప్పకూలటంతో వేడుక కోసం వచ్చిన వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆనందంతో మొదలైన ‘ జెండర్ రివీల్ పార్టీ’ అనుకోని ఘటనతో చివరికి విషాదంతో ముగిసింది. ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
🚨#WATCH: Terrifying footage of a Gender reveal party turns tragic as hired pilot crashes and dies
Watch as horrifying footage shows a gender reveal celebration taking a tragic turn. A hired pilot in a small Piper PA-25 plane experiences a shallow dive… pic.twitter.com/3biwE2ciL7
— R A W S A L E R T S (@rawsalerts) September 3, 2023
Also Read..
G20 Summit | జీ20 సమ్మిట్‌కు జిన్‌పింగ్ గైర్హాజరు : ప్రకటించిన చైనా
Harish Salve | 68 ఏళ్ల వయసులో ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న టాప్ లాయర్.. హాజరైన ప్రముఖులు