సాధారణంగా మనుషుల్లో గే ఉంటారు కానీ.. జంతువుల్లో గే ఉండటం ఎప్పుడైనా చూశారా? తాజాగా ఒక గే కుక్కను యూఎస్‌లోని నార్త్ కరోలినాలో గుర్తించారు. దాన్ని ఓ ఫ్యామిలీ పెంచుకుంటోంది. దానికి వయసు వచ్చాక.. అది ఆడకుక్కల వెంట పడటం మానేసి.. మగ కుక్కల వెంట పడటాన్ని ఓనర్ గమనించాడు. ఆడ కుక్కల మీద కాకుండా.. మగ కుక్కల మీద ఎక్కడం.. వాటితోనే గడపడం గుర్తించి.. దీన్ని గే కుక్కగా అనుమానించాడు. దీంతో వెంటనే దాన్ని స్టాన్నీ కంట్రీలో ఉన్న యానిమల్ షెల్టర్‌కు ఓనర్ తరలించాడు.
ఆ కుక్క పేరు ఫెజ్కో. దాని వింత ప్రవర్తనను చూసిన ఓనర్ ముందు ఆశ్చర్యపోయాడు. అది ఇంట్లో ఉండటం సేఫ్ కాదని అనుకొని వెంటనే యానిమల్ షెల్టర్‌కు పంపించాడు. ఆ తర్వాత ఫెజ్కో స్టోరీని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. నెటిజన్లు ఆ పోస్ట్‌ను చూసి కుక్క విషయంలో కూడా అంత కర్కశంగా ప్రవర్తిస్తారా.. ఏదో వేరే కుక్కలను డామినేట్ చేయడం కోసం అవి వాటితో పోట్లాడుతాయి. దాన్ని వేరేలా అర్థం చేసుకుంటే ఎలా.. అంటూ ఆ కుక్క ఓనర్‌పై ఫైర్ అవుతున్నారు.