కరోనా సమయంలో మనం మాస్కు లేనిదే బయటికి రాలేదు. మాస్కు మన జీవితంలో భాగమైపోయింది. మహమ్మారి తగ్గుముఖం పట్టాక వాటి వాడకం తగ్గింది. అయితే, ఓ కారు యజమాని వినూత్నంగా ఆలోచించాడు. తన పెంపుడు చిలుకలకు మాస్కులతో ఊయల కట్టాడు. ఇంకేం చిలుకలు హుషారుగా షి‘కారు’ చేయడం మొదలెట్టాయి.
ఈ వీడియోను ‘వ్యూస్ మ్యాక్స్’ అనే యూజర్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. కారు ముందు ఊయలలా వేలాడదీసిన మాస్కులలో పసుపు, తెలుపు రంగు చిలుకలు ఉషారుగా ఊగుతున్నాయి. కీచుకీచుమంటూ ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నాయి. ఈ పూజ్యమైన వీడియో ఇప్పటివరకూ 4.4 మిలియన్లకు పైగా వీక్షణలు, 2లక్షలకుపైగా లైక్స్‌తో దూసుకుపోతున్నది. వీడియో చూసిన నెటిజన్లు లవ్ ఎమోజీలతో ముంచెత్తుతున్నారు.