Parle melody | ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో మోదీ భేటీ.. రెండు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందన్న ప్రధాని
ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఇటలీ, ఇండియా మధ్య ప్రత్యేకమైన వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని చెప్పారు.
Parle melody : భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం ఇటలీలో పర్యటిస్తున్నారు. అక్కడ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఇటలీ, ఇండియా మధ్య ప్రత్యేకమైన వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని చెప్పారు. రెండు దేశాల మధ్య సంబంధాలు కీలక దశకు చేరుకునే స్థితికి చేరాయన్నారు.
అలాగే, 2025–2029 వరకు ఇండియా–ఇటలీ మధ్య ఉమ్మడి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికను కూడా మోదీ వెల్లడించారు. రెండు దేశాల మధ్య సంబంధాల పెంపునకు, భవిష్యత్ నిర్మాణానికి ఇది దోహదం చేస్తుందన్నారు. రెండు దేశాల మధ్య 20 బిలియన్ యూరోలు టార్గెట్‌గా వ్యాపారాన్ని విస్తరించనున్నట్లు వెల్లడించారు. ఇటలీకి చెందిన 400 సంస్థలు దేశంలో ఇప్పటికే సేవలందిస్తున్నాయని మోదీ తెలిపారు. అనంతరం ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మాట్లాడుతూ.. ఇప్పుడు రెండు దేశాల మధ్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేని ఉన్నత స్థాయికి చేరాయని చెప్పారు. పూర్తిస్థాయిలో సంబంధాల్ని బలోపేతం చేసుకుంటామన్నారు. మోదీతో తాను ఏడుసార్లు సమావేశమైనట్లు మెలోని చెప్పారు.
తనకు మోదీకి మధ్య పరస్పర స్నేహం, గౌరవం, విశ్వాసం ఉన్నాయన్నారు. మరోవైపు.. ఈ భేటీ సందర్భంగా ఇటలీ ప్రధాని మెలోనికి ప్రధాని మోదీ.. మెలోడి చాక్లెట్లు ఇచ్చారు. ఇద్దరి పేర్లకు సంబంధించి మెలోని పేరులోని మెలో.. మోడీ పేరులోని డీ ఉండేలా మెలోడి చాక్లెట్లను అందించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో మెలోడి చాక్లెట్ల తయారీ సంస్థ పార్లే షేర్ల విలువ గణనీయంగా పెరిగింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

