Viral News | స్కూల్‌కు వెళ్లనని మారాం చేస్తున్న ఐదేండ్ల బాలికకు.. రూ.కోట్లు విలువ చేసే కారును గిఫ్ట్‌గా ఇచ్చిన దంపతులు
Viral News | సాధారణంగా కాస్త గ్యాప్ వచ్చిన తర్వాత పిల్లలు పాఠశాల (School)కు వెళ్లం అంటూ మారాం చేస్తుంటారు. అలాంటి సమయంలో తల్లిదండ్రులు తమ బిడ్డలకు ఇష్టమైన బొమ్మలు (Toys), చాక్లెట్స్ (Chocolates) వంటివి కొనిస్తామని సర్దిచెప్పి పాఠశాలకు పంపుతుంటారు.
Viral News | సాధారణంగా కాస్త గ్యాప్ వచ్చిన తర్వాత పిల్లలు పాఠశాల (School)కు వెళ్లం అంటూ మారాం చేస్తుంటారు. అలాంటి సమయంలో తల్లిదండ్రులు తమ బిడ్డలకు ఇష్టమైన బొమ్మలు (Toys), చాక్లెట్స్ (Chocolates) వంటివి కొనిస్తామని సర్దిచెప్పి పాఠశాలకు పంపుతుంటారు. అయితే, స్కూల్‌కు వెళ్లనని మారాం చేస్తున్న ఐదేండ్ల బాలికకు తల్లిదండ్రులు ఏకంగా రూ.కోట్లు విలువ చేసే లగ్జరీ ఎస్యూవీ కారు ( luxury SUV car )ను బహుమతిగా ఇచ్చారు.
మలేషియా (Malaysia)కు చెందిన పారిశ్రామిక వేత్త ఫర్హానా జహ్రాకు (Farhana Zahra) ఫాతిమా (Fatima) అనే ఐదేండ్ల కుమార్తె ఉంది. ఆమె ఒక్కతే సంతానం కావడంతో గారాబంగా పెంచుకున్నారు. ఈ ఏడాది మొదట్లో ఫాతిమా అనారోగ్యం బారిన పడింది. దీంతో అప్పటి నుంచి స్కూల్ వెళ్లలేదు. ఆరోగ్యం కుదుట పడిన తర్వాత తిరిగి స్కూల్ (School)కు వెళ్లనని మారాం చేసింది. దీంతో కూతురుని స్కూల్‌కు పంపేందుకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని తల్లిదండ్రులు భావించారు. ఈ క్రమంలో త్వరలో ఫాతిమా పుట్టినరోజును దృష్టిలో పెట్టుకుని ఏం గిఫ్ట్ కావాలని అడగ్గా.. బీఎండబ్ల్యూ (BMW) లేదా మెర్సిడెస్ జి వ్యాగన్ (Mercedes G Wagon) కావాలని కోరింది. కారు కొనిస్తే క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్తానని ప్రామిస్ చేసింది.
ఈ మేరకు ఫర్హానా తన కుమార్తెకు పుట్టిన రోజు బహుమతిగా రూ.3 కోట్లకుపైనే విలువ చేసే మెర్సిడెస్ బెంజ్ కారును కొనిచ్చారు. ఇక అప్పటి నుంచి ఫాతిమా రోజూ పాఠశాలకు వెళ్తోందట. ఇందుకు సంబంధించిన వివరాలను స్థానిక మీడియా ప్రచురించగా.. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. ఈ ఘటనపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఐదేండ్ల చిన్నారికి ఖరీదైన కారును బహుమతిగా ఇవ్వడం ఏంటి..? అని ప్రశ్నిస్తున్నారు.
Also Read..
Upasana | ఉపాసన కోసం చిరంజీవి తల్లి స్పెషల్ వంటకం.. వీడియో షేర్ చేసిన మెగా కోడలు
India Corona | 10 వేలలోపే కొత్త కేసులు.. 60 వేలు దాటిన యాక్టివ్ కేసులు
Bathinda Military Station | బఠిండా మిలిటరీ స్టేషన్లో కాల్పుల ఘటన.. సైనికుడి అరెస్ట్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

