Pak PM Anwarul Haq | ఇస్లామాబాద్: నూతన సంవత్సరం ప్రారంభ సమయంలో పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధాన మంత్రి అన్వరుల్ హక్ కాకర్ (52) లవ్ గురువుగా మారారు. పలువురు అడిగిన సరదా ప్రశ్నలకు హుషారుగా సమాధానాలు చెప్పారు. 52 ఏండ్ల వయసులో ఉన్న పురుషుడు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు నా? అని అడిగినప్పుడు ఆయన మా ట్లాడుతూ.. తప్పకుండా చేసుకోవచ్చు.
82 ఏండ్ల వయసులోనైనా సరే! అని చెప్పారు. వేధించే అత్త దొరికితే ఏం చేయాలి? అని మరొకరు అడిగినప్పుడు.. ‘క్రైసిస్ మేనేజ్మెంట్ కోర్సు చేయాల్సిందే’అని చెప్పారు. చేతిలో డబ్బు లేకుండా ఎవరినైనా ఆకట్టుకోవాలంటే ఏం చేయాలనే ప్రశ్నకు.. తాను తన జీవితంలో ఎన్నడూ ఇతరులను ఆకట్టుకోవడానికి ప్రయత్నించలేదని, తన పట్ల చాలా మంది ఆకర్షితులయ్యారని తెలిపారు. విదేశాల్లో ఉద్యోగం పొందిన వ్యక్తి తన ప్రియురాలిని వదిలిపెట్టి వెళ్లాల్సి వస్తే ఏం చేయాలని అడగగా.. అత్యంత భావోద్వేగంతో సమాధానం చెప్పారు.