భారత్ సంబంధాలపై స్పందించిన కాబోయే పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్!
ఇస్లామాబాద్ : కశ్మీర్ సమస్య పరిష్కారమయ్యే వరకు భారత్‌లో సంబంధాలు సాధారణ స్థితికి రావని పాక్ ప్రధానమంత్రి అభ్యర్థి షాబాజ్ షరీఫ్ అన్నారు. శనివారం అర్ధరాత్రి పాక్ జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గిన విషయం తెలిసింది. ఆ తర్వాత ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యూతుడయ్యాడు. అవిశ్వాసం నెగ్గడంతో ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నది. ఈ క్రమంలోనే షాబాజ్ షరీఫ్‌ను ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఈ మేరకు ఆయన నామినేషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా ఆయనను కొత్త ప్రభుత్వం భారత్‌తో సంబంధాలను సాధారణీకరించేందుకు కృషి చేస్తుందా? అని మీడియా ప్రశ్నించింది. కశ్మీర్ సమస్య పరిష్కారం కానంత వరకు భారత్‌తో సంబంధాలు సాధారణ మామూలుగా ఉండవని చెప్పారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై కొనసాగుతున్న కేసులకు సంబంధించిన విషయంపై స్పందించారు. కేసులపై విచారణ చట్టపరంగా కొనసాగుతుందని పేర్కొన్నారు.
షా ఖురేషీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన పీటీఐ
అవిశ్వాస తీర్మానంలో ఓటమిపాలైన ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ తమ ప్రధాని అభ్యర్థి పేరును ప్రకటించింది. ప్రధానమంత్రి అభ్యర్థిగా మాజీ విదేశాంగ మంత్రి షా మెహమూద్ షురేషీని ప్రకటించింది. ఉమ్మడి ప్రతిపక్షం షాబాజ్ షరీఫ్‌ను ప్రధాని పదవికి ఎంపిక చేయగా.. ఆయన ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. నిన్న అర్ధరాత్రి తర్వాత పాకిస్థాన్ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి.
అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరుగకుండా ఉండేందుకు పార్లమెంట్ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ రాజీనామా చేశారు. 12.40 గంటల ప్రాంతంలో ఓటింగ్ జరగ్గా.. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 174 మంది సభ్యులు ఓటు వేయడంతో ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తర్వాత జాతీయ అసెంబ్లీని సోమవారానికి వాయిదా పడింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

