ఉగ్రవాద చట్టం కింద ఇమ్రాన్ ఖాన్‌పై కేసు నమోదు
ఇస్లామాబాద్: ఉగ్రవాద చట్టం కింద పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై కేసు బుక్ చేశారు.ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం సోమవారం ఇస్లామాబాద్ హైకోర్టును ఇమ్రాన్ ఆశ్రయించారు. ఇటీవల జరిగిన ఓ పబ్లిక్ ర్యాలీలో.. మహిళా జడ్జితో పాటు కొందరు సీనియర్ పోలీసు అధికారులకు ఇమ్రాన్ ఖాన్ బెదిరింపులు చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం యాంటీ టెర్రరిజం యాక్ట్‌లోని సెక్షన్ 7 కింద ఇమ్రాన్‌పై కేసు నమోదు చేశారు. ఇమ్రాన్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన తరపున లాయర్లు బాబర్ అవాన్, ఫైసల్ చౌదరీలు ఇవాళ కోర్టును కోరారు. అధికారంలో ఉన్న పీడీఎం ఇమ్రాన్‌ను కావాలనే టార్గెట్ చేసినట్లు పిటిషన్లో లాయర్లు ఆరోపించారు. ఇమ్రాన్‌ను అరెస్టు చేస్తారేమో అన్న ఉద్దేశంతో ఆయన అభిమానులు భారీ సంఖ్యలో ఇంటి వద్దకు చేరుకున్నారు. ఏప్రిల్‌లో ఇమ్రాన్ తన పదవిని కోల్పోయిన విషయం తెలిసిందే. దేశ ద్రోహం చట్టం కింద తన సన్నిహితుడిని హింసిస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేంద్రం ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయం.. డీలిమిటేషన్‌పై కేటీఆర్..!
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Siddugadi Love Story | యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌నూ కట్టిపడేస్తున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’.. ఘనంగా సక్సెస్ మీట్!
Thiruveer | ‘శ్రీమతి’ నా జీవితంలో ఒక ఎమోషన్.. ఆ టైటిల్ వినగానే నా గతం గుర్తొస్తుంది : తిరువీర్
KTR | కాంగ్రెస్ ఏం కోరుకుంటుంది అసలు..? నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

