పాక్ తదుపరి ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్..!
Pakistan Army Chief | పాకిస్థాన్ తదుపరి ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు ఆ దేశ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ గురువారం ప్రకటించారు. ప్రస్తుతం ఆర్మీ చీఫ్గా ఉన్న ఖమర్ జావెద్ బజ్వా ఈ నెల చివరిలో పదవీ విరమణ పొందనున్నారు. అనంతరం తదుపరి ఆర్మీ చీఫ్గా అసిమ్ మునీర్ బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఆ దేశ సమాచార శాఖ మంత్రి వెల్లడించారు.
Pakistan Army Chief | పాకిస్థాన్ తదుపరి ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు ఆ దేశ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ గురువారం ప్రకటించారు. ప్రస్తుతం ఆర్మీ చీఫ్గా ఉన్న ఖమర్ జావెద్ బజ్వా ఈ నెల చివరిలో పదవీ విరమణ పొందనున్నారు. అనంతరం తదుపరి ఆర్మీ చీఫ్గా అసిమ్ మునీర్ బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఆ దేశ సమాచార శాఖ మంత్రి వెల్లడించారు.
ఆర్మీ చీఫ్గా 2016 నవంబరు 29న బజ్వా బాధ్యతలు చేపట్టారు. ఆరేళ్లపాటు పదవిలో కొనసాగిన ఆయన ఈ నెలలో పదవీ విరమణ పొందనున్నారు. కాగా, బజ్వా ప్రస్తుతం తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో పాకిస్థాన్ అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే, బజ్వా కుటుంబసభ్యుల సంపద మాత్రం గత ఆరేళ్లలో అమాంతం పెరిగిపోయింది. ఈ మేరకు ఆదాయ పన్ను రికార్డుల ఆధారంగా ఫ్యాక్ట్ ఫోకస్ వెబ్సైట్ సంచలన కథనం ప్రచురించింది. ఆ కథనం ప్రకారం దేశ, విదేశాల్లో ఉన్న బజ్వా ఆస్తుల ప్రస్తుత విలువ రూ.1,270 కోట్లు. ఇది ఆదాయ పన్ను శాఖకు తెలియజేసిన విలువ మాత్రమే అని కథనంలో పేర్కొంది. మరికొద్ది రోజుల్లోనే ఆర్మీ చీఫ్గా బజ్వా పదవీకాలం ముగియనున్న సమయంలో ఈ వార్తలు బహిర్గతమవడం పాక్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి
Women Carried Guns To Mumbai | టైగర్ ష్రాఫ్పై కాల్పుల కోసం.. ముంబైకు గన్స్ తరలించిన యూపీ మహిళలు
Mirage 2000D: కూలిన మిరేజ్-2000డీ యుద్ధ విమానం.. ఒకరు మృతి, మరొకరి కోసం గాలింపు
Akada Demonstrations | గోదావరిఖనిలో విశేషంగా ఆకట్టుకున్న అకాడ ప్రదర్శనలు.. కర్ర సామును ప్రదర్శించిన సంధ్యారాణి
NHM Employees | డీఎంహెచ్వో కార్యాలయం ఎదుట ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

