Pakistan | పాకిస్తాన్లో ‘స్మార్ట్ లాక్డౌన్’ విధించిన ప్రభుత్వం.. చమురు సంక్షోభంతో కీలక నిర్ణయం
Pakistan : ఇరాన్ యుద్ధం ప్రభావం పాకిస్తాన్‌పై గట్టిగా పడుతోంది. హార్ముజ్ జలసంధి మూసివేయడం, విదేశాల నుంచి చమురు రాకపోవడంతో పాకిస్తాన్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది.
Pakistan : ఇరాన్ యుద్ధం ప్రభావం పాకిస్తాన్‌పై గట్టిగా పడుతోంది. హార్ముజ్ జలసంధి మూసివేయడం, విదేశాల నుంచి చమురు రాకపోవడంతో పాకిస్తాన్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. చమురు కొరత ప్రభావంతో ఇప్పటికే దేశంలో పలు ఆంక్షలు విధించిన పాక్ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ‘స్మార్ట్ లాక్డౌన్’ విధిస్తూ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆదేశాలు జారీ చేశారు. చమురు కొరతపై రాష్ట్రాల సీఎంలతో సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నాడు.
చమురు వినియోగాన్ని తగ్గించేందుకు, ఉన్న నిల్వల్ని కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ ప్రధాని చెప్పాడు. ‘స్మార్ట్ లాక్డౌన్’ పై స్థానిక రేడియో వెల్లడించిన వివరాల ప్రకారం.. పాక్‌లోని పంజాబ్, ఖైబర్ పక్తుంఖ్వా, బలూచిస్తాన్, ఇస్లామాబాద్, గిగ్లిత్ బల్తిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో పలు ఆంక్షలు విధించారు. మార్కెట్లు, షాపులు, ఇతర కమర్షియల్ స్పేసెస్ అన్నీ రాత్రి ఎనిమిది గంటలకు మూసేయాలి. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మినహాయింపులు ఇచ్చారు. అక్కడ రాత్రి 9 గంటల వరకు అనుమతి ఉంటుంది. జనరల్ స్టోర్స్, డిపార్ట్మెంట్ స్టోర్స్ వంటివి ఎనిమిది గంటలకే మూసేయాలి. అలాగే, బేకరీలు, రెస్టారెంట్లు, ఇతర ఫుడ్ ఔట్లెట్లు మాత్రం రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచొచ్చు. అలాగే, పెళ్లి వేడుకలపై కూడా ఆంక్షలు విధించారు.
రాత్రి 10 గంటల తర్వాత ఇళ్లల్లో మాత్రమే పెళ్లి వేడుకలు తక్కువ మందితో నిర్వహించుకోవాలి. మెడికల్ స్టోర్స్, ఫార్మసీలు మాత్రం ఎల్లప్పుడూ తెరిచి ఉంటాయి. ఈ ఆంక్షలన్నీ మంగళవారం నుంచే అమలు చేయబోతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కొన్ని చోట్ల ప్రైవేటు వాహనాలపై నిషేధం విధించారు. అలాగే, ప్రభుత్వ రవాణా ఉచితంగా అందిస్తున్నారు. నెల రోజులపాటు గిల్గిత్, ముజఫరాబాద్ వంటి చోట్ల ఉచిత ప్రయాణం చేయవచ్చు. హార్ముజ్ జలసంధి తెరిచి, చమురు అందుబాటులోకి వచ్చే వరకు ఈ పరిస్థితి ఉంటుందని పాక్ అధికార వర్గాలు తెలిపాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

