Petrol Price | వామ్మో.. అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.272.. హైస్పీడ్ డీజిల్ ధర రూ.280
ఆర్థిక సంక్షభంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాక్ ప్రజలపై ప్రభుత్వం మరో బాంబు పేల్చింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను భారీగా పెంచింది. గతనెల 29న లీటర్ డీజిల్, పెట్రోల్‌పై రూ.35 చొప్పున పెంచిన షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం..
Petrol Price | ఇస్లామాబాద్: ఆర్థిక సంక్షభంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాక్ ప్రజలపై ప్రభుత్వం మరో బాంబు పేల్చింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను భారీగా పెంచింది. గతనెల 29న లీటర్ డీజిల్, పెట్రోల్‌పై రూ.35 చొప్పున పెంచిన షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం.. తాజాగా పెట్రోల్‌పై రూ.22.20, హై స్పీడ్ డీజిల్‌పై రూ.17.20, కిరోసిన్‌పై రూ.12.90 చొప్పున వడ్డించింది. దీంతో దాయాది దేశంలో లీటర్ పెట్రోల్ కొనాలంటే రూ.272 (పాక్ కరెన్సీలో) ఖర్చుచేయాల్సిందే. ఇక హైస్పీడ్ డీజిల్ ధర రూ.280, లైట్ స్పీడ్ డీజిల్ రూ.196.68, కిరోసిన్ రూ.202.73కు పెరిగాయి. పెరిగిన ధరలు గురువారం తెల్లవారుజాము నుంచే అమల్లోకి వచ్చాయి.
డాలర్‌తో పాక్ రూపాయి విలువ దారుణంగా పడిపోవడంతో పెట్రోల్, డీజిల్‌తోపాటు నిత్యావసర పదార్థాల ధరలు పాకిస్థాన్‌లో చుక్కలనంటాయి. లీటర్ పాల ధర రూ.210, కిలో చికెన్ రూ.700 నుంచి రూ.800 వరకు పలుకుతున్నది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు మినీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కొద్దిగంటల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం గమనార్హం. కాగా, 2023 మొదటి ఆరు నెలల్లో పాకిస్థాన్‌లో సగటు ద్రవ్యోల్బణం 33 శాతానికి పెరిగే అవకాశం ఉందని మూడీస్ సీనియర్ ఆర్థికవేత్త చెప్పారు. ఐఎంఎఫ్ నుంచి బెయిలవుట్ ప్యాకేజీ లభించినా, దేశం ఈ విచారకరమైన స్థితి నుంచి ప్రస్తుతం బయటపడలేదని అంచనావేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

